Dandruff: డాన్‌డ్రఫ్ ఫ్రీ జుట్టు కోసం రోజూ ఇలా చేయండి చాలు..

Remove Dandruff Permanently At Home: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ జుట్టు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 12:18 PM IST
Dandruff: డాన్‌డ్రఫ్ ఫ్రీ జుట్టు కోసం రోజూ ఇలా చేయండి చాలు..

Remove Dandruff Permanently At Home: చలికాలం రాగానే జుట్టులో చుండ్రు సమస్య రావడం సర్వసాధారణం. జుట్టును తాకినప్పుడు , మీ తల నుంచి చుండ్రు రాలడం ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు స్కాల్ప్ నుంచి సెబమ్‌ను పీల్చుకోవడం వల్ల ఫంగస్ ఏర్పడి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా జుట్టులో చుండ్రు పెరగడం ప్రారంభమవ్వడమే కాకుండా చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయి. కాబట్టి జుట్టులోని చుడ్రును నివారించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే చాలా రకాల ఇన్పెక్షన్స్‌కు దారి తీసే అవకాశాలున్నాయి. అయితే దీనిని నివారించడానికి ఎలాంటి చిట్కాలను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చుండ్రు తొలగించడానికి చిట్కాలు:
జుట్టు శుభ్రంగా ఉంచుకోండి:

చుండ్రును నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తలలోని చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీ జుట్టును వారానికి 3-4 సార్లు కడగాలి. ఈ క్రమంలో మీరు  2 శాతం కెటోకానజోల్ లేదా జింక్ పైరిథియోన్ ఆధారిత షాంపూను ఉపయోగించవచ్చు.

జుట్టుకు నూనె పెట్టుకోకూడదు:
జుట్టులో చుండ్రు సమస్యలతో బాధపడేవారు హెయిర్ ఆయిల్‌ను అప్లై చేయడం మానుకోవాలి. జుట్టుకు నూనె రాయడం వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది.

మురికి దువ్వెన ఉపయోగించవద్దు:
చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. ఎవరైనా ఉపయోగించిన దువ్వెన లేదా అరువు తెచ్చుకున్న దువ్వెనను మీ జుట్టుకు ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టులో చుండ్రు సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి.

టోపీ పెట్టుకోవద్దు:
ఎండలో బయటకు వెళ్లి టోపీని ధరిస్తే చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చుండ్రు సమస్యలతో బాధపడేవారు టోపీని పెట్టుకోవడం వల్ల  తీవ్ర చుండ్రు సమస్యకు దారితీస్తుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News