Red Rice For Diabetes: డయాబెటిస్, కీళ్లనొప్పుల సమస్యలా..? రెడ్‌ రైస్‌తో 10 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!

Red Rice For Diabetes: భారత్‌లో చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 04:54 PM IST
  • ప్రతి రోజూ రెడ్ రైస్‌ తింటే 10 రోజుల్లో
  • మధుమేహం, కీళ్లనొప్పులు,
  • బరువు తగ్గడం సమస్యలు తగ్గుతాయి.
Red Rice For Diabetes: డయాబెటిస్, కీళ్లనొప్పుల సమస్యలా..? రెడ్‌ రైస్‌తో 10 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!

Control Diabetes with Red Rice: మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యులు తరచుగా వైట్‌ రైస్‌ను తినకూడదని చేబుతూ ఉంటారు. రైస్‌ను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి మధుమేహం తీవ్ర తరమయ్యే అవకాశాలున్నాయి. అయితే వైట్‌ రైస్‌కు బదులుగా కొంతమంది బ్రౌన్ రైస్‌ను కూడా తీసుకుంటున్నారు. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉండడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే మీకు రెడ్‌ రైస్‌ గురించి తెలుసా.. ఇవి కూడా మధుమేహం ఉన్న వారు తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఆంథోసైనిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటాయి. కాబట్టి ఈ రైస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి.

రెడ్‌ రైస్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:

మధుమేహం:
చాలా మందికి రెడ్ రైస్‌ గురించి అస్సలు తెలియదు. అయితే ఇందులో శరీరానికి అవసరమన గ్లైసెమిక్ ఇండెక్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

కీళ్లనొప్పులు:
ప్రస్తుతం చాలా మంది చిన్న వయసుల్లోనే కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. అయితే  ఆర్థరైటిస్ వంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు జీవన శైలిలో మార్పులేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఎర్ర బియ్యాన్ని ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎములను దృఢంగా చేసే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.

బరువు తగ్గడం:
రెడ్ రైస్‌లో ఫైబర్ పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఒక పూట ఆహారంగా తీసుకుంటే శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

ఉబ్బసం:
రెడ్ రైస్‌లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. రెగ్యులర్ డైట్‌లో ఈ రైస్‌ని చేర్చుకుంటే ఆక్సిజన్ సర్క్యులేషన్ మెరుగు పడి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా ఉబ్బసం సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

జీర్ణక్రియ:
ఎర్ర బియ్యం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ప్రయోజనకరమైనవిగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ ఆహారంగా తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి.

Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..

Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్‌ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News