Red Guava Benefits: తెల్ల జామ కంటే ఎర్ర జామలోనే ఎక్కువ పోషకాలు లభిస్తాయి..వీటితో బోలెడు లాభాలు..

Red Guava Benefits: ఎర్ర జామను ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2023, 01:33 PM IST
Red Guava Benefits: తెల్ల జామ కంటే ఎర్ర జామలోనే ఎక్కువ పోషకాలు లభిస్తాయి..వీటితో బోలెడు లాభాలు..

 

Red Guava Benefits: అన్ని పండ్లలో జామ పండు ఎంతో రుచికరమైనది..ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. భారతీయులు ఎక్కువగా జామపండ్లను కట్‌ చేసుకుని రుచి కోసం బ్లాక్ సాల్ట్ లేదా చాట్ మసాలాతో తీసుకుంటారు. అయితే ఈ పండ్లను ప్రతి రోజు తీనడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే తెల్ల జామకు బదులుగా ఎర్రనివి తీసుకోవడం వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎర్ర జామ ప్రయోజనాలు:

✤ ఎర్ర జామ పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. తెల్ల జామతో పోలిస్తే ఎర్ర జామలో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి.  ముఖ్యంగా వర్షాకాలంలో ఎర్రజామను ఎక్కువగా తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.

✤ ఎర్ర జామపండులో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సీడెంట్స్‌ కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఎర్ర జామను తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. 

Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

✤ ఎర్ర జామను ప్రతి రోజు తినడం వల్ల ఐరన్ లోపం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎర్ర జామపండు తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

✤ అధిక రక్త పోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఎర్ర జామను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం అధిక మోతాదులో లభిస్తుంది.

✤ జామలో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. రోగనిరోధక సమస్య కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతి రోజు వీటిని తినొచ్చు. 

Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News