Pregnancy Coconut Water: గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా?

Pregnancy Coconut Water: ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు తాగమని ఇంట్లోని పెద్దవారు సూచిస్తుంటారు. కానీ, గర్భవతులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 12:56 PM IST
Pregnancy Coconut Water: గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా?

Pregnancy Coconut Water: గర్భధారణ సమయంలో తరచుగా కొబ్బరి నీళ్ళు తాగమని ఇంట్లోని పెద్దవారు సూచిస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల పిల్లలు రంగు రావడం సహా జుట్టు బాగా పెరుగుతుందని వారి నమ్మకం. కానీ, ఇది పూర్తిగా నిజం కాదు. అయితే గర్భవతులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 

గర్భవతులు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

కొబ్బరి నీరు శరీరానికి ఆరోగ్యం సహా కొవ్వు రహితమైనది. కడుపులో చల్లగా ఉండడం సహా శరీరంలో ఉత్సాహాన్ని పెంచుతోంది. తరచూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. కొబ్బరి నీటిలోని జీరో కొలెస్ట్రాల్ లక్షణాల వల్ల బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడం సహా మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతుంది.

కొబ్బరి నీళ్లలో అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గర్భవతులు కొబ్బరినీళ్లు తాగడం వల్ల తల్లిబిడ్డలను వ్యాధుల నుండి రక్షిస్తుంది. దీంతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో కొబ్బరి నీరు మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. 

గర్భవతులు కొబ్బరి నీళ్లు తాగడంపై ఉన్న అపోహలు

1. పిల్లల రంగు పిల్లల తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది. కొబ్బరి నీళ్ల ద్వారా మెరుగైన రంగు తీసుకురాలేదు. 

2. జన్యుపరంగా శిశువు జుట్టు మందం ఆధారపడి ఉంటుంది. కొబ్బరి నీరు వల్ల పుట్టే బిడ్డపై ప్రభావం చూపదు. 

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫ్లేవర్ లతో కొబ్బరి నీళ్లను అమ్ముతున్నారు. కాబట్టి గర్భవతులు రోజుకు సరిపడా మంచినీటిని తాగితే మేలు జరుగుతుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారం కొన్ని నివేదికల ఆధారంగా సేకరించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)   

Also Read: Back Pain in Gents: మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే వెన్నునొప్పి సమస్య ఎక్కువ- అందుకు కారణాలివే!

Also Read: Covid Symptoms in Teeth: కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళనలు.. ఈ 6 లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News