Kidney Stones: మీ కిడ్నీలలో రాళ్లు ఉన్నాయా...అయితే ఈ 4 ఆహార పదార్థాలు అసలు తినకండి! ఎందుకో తెలుసా?

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి భరించడం చాలా కష్టం. వయసుతో సంబంధం లేకుండా  చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2021, 12:22 PM IST
Kidney Stones: మీ కిడ్నీలలో రాళ్లు ఉన్నాయా...అయితే ఈ 4 ఆహార పదార్థాలు అసలు తినకండి! ఎందుకో తెలుసా?

Kidney Stones: మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో మూత్ర పిండాలు(కిడ్నీలు) ఒకటి.  శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి.. మనల్ని ఆరోగ్యం(health)గా ఉంచడంలో కిడ్నీ(Kidney)లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి పనితీరులో చిన్న అవాంతరం ఏర్పడినా సమస్యలు తప్పవు. ఎంతో సున్నితంగా ఉండే కిడ్నీలను కాపాడు కోవాలంటే.. నీళ్లు(Water) ఎక్కువగా తాగాలి. నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 

లక్షణాలు ఏంటంటే..
పొత్తికడుపులో నిరంతర నొప్పి(Stomac pain), పొత్తికడుపులో ఒక భాగంలో అకస్మాత్తుగా భరించలేని నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు కొద్దిగా నొప్పి, తరచుగా మూత్ర విసర్జన, వికారం,బలహీనత, మైకం, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు(kidney stone patients) ఈ 4 ఆహారాలను అస్సలు తినకూడదు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

Also Read: Heart Attack: గుండెపోటుకు చెక్ పెట్టాలంటే... కచ్చితంగా ఈ 5 విషయాలు పాటించండి!

1. ఉప్పు తగ్గించాలి
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆహారంలో ఉప్పు(Salt)ను తగ్గించాలి. జంక్ ఫుడ్(Junk Food) తినడం మానుకోండి. ఇది కాకుండా చైనీస్, మెక్సికన్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆహారాల జోలికి పోకండి.

2. మాంసం తీసుకోవడం తగ్గించండి
కిడ్నీ స్టోన్ రోగులు నాన్ వెజ్‌ ఆహారాలు(Non Veg Food) తినడం మానుకోవాలి. నాన్-వెజ్ డైట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ మూత్రపిండాల(Kidneys)పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నాన్-వెజిటేరియన్ డైట్‌లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది ఇది స్టోన్ పరిమాణం పెరిగే అవకాశాలను పెంచుతుంది.

3. చాక్లెట్లు బంద్‌
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు చాక్లెట్లు(Chocolates) తినకూడదు. కొంతకాలం మానేయండి. చాక్లెట్‌లో ఆక్సలేట్ ఉంటుంది దీనివల్ల కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయి. అందుకే వీటిని తినడం ప్రమాదం.

4. విటమిన్ సి
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు విటమిన్ సి(Vitimin C) అధికంగా ఉండే ఆహార పదార్థాలను పరిమితం చేయాలి. విటమిన్ సి లో ఉండే ఆక్సలేట్ కాల్షియంను నిల్వ చేస్తుంది. అలాగే పాలకూర, తృణధాన్యాలు, చాక్లెట్, టమోటాలలో ఆక్సలేట్‌లో పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం మానుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News