Oats Facts In Telugu: మారుతున్న జీవనశైలి, అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. మరికొందరైతే ఎక్కువగా అన్నానికి బదులుగా ఫ్రూట్స్ తింటున్నారు. మరికొంతమంది ఓట్స్ తింటున్నారు. నిజానికి రోజు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలిగినప్పటికీ అతిగా తినడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజు అతిగా తినడం వల్ల పొట్ట సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా అతిగా తినడం వల్ల మరెన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి.
ఓట్స్ తింటే కలిగే దుష్ప్రభావాలు:
జీర్ణ సమస్యలు:
ఓట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేసినప్పటికీ అతిగా తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓట్స్ అతిగా తినడం వల్ల పొట్టలో ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె జబ్బులు:
అతిగా ఓట్స్ తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. రోజు అతిగా తీసుకుంటే రక్తపోటుతో పాటు గుండె సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గ్లూటెన్ సెన్సిటివిటీ:
కొన్ని ఓట్స్‌లో గోధుమలు లేదా బార్లీతో తయారు చేసిన కల్తీ ఓట్స్ కలిసే అవకాశాలు ఉన్నాయి. దీని కాణంగా కొంతమందిలో గ్లూటెన్ సెన్సిటివిటీ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు ఓట్స్‌ను అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది.
బరువు పెరగడం:
ఓట్స్‌ను చక్కెర, పాలు లేదా ఇతర కొవ్వు పదార్థాలతో కలిపి తీసుకుంటే సులభంగా బరువు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు ఓట్స్‌ను తినడం మానుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అలెర్జీ సమస్యలు:
కొంతమంది అతిగా ఓట్స్‌ను తినడం వల్ల అలెర్జీ వంటి సమస్యలకు దారీ తీసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు చర్మంపై దురద, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే చర్మ సమస్యలతో బాధపడేవారు ఓట్స్ తినడం మానుకుంటే చాలా మంచిది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.