Navratri Fasting With Diabetes: ప్రస్తుతం భారత్‌లో శారదీయ నవరాత్రులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాకుండా చాలా మంది ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇలా తొమ్మది రోజుల పాటు ఉపవాసాలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడమేకాకుండా ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయని హిందువుల నమ్మకం. అయితే ఈ క్రమంలో మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా ఉపవాసాలు పాటించవచ్చు. ఇలా ఉపవాసాలు పాటించడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరు పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..మధుమేహ వ్యాధిగ్రస్తులు నవరాత్రి ఉపవాసం పాటించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది:
ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు:
మధుమేహ రోగులు ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఆకలితో అస్సలు ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు డయాబెటిక్ పేషెంట్స్ అయితే ప్రతి రెండు గంటలకొకసారి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
టీ తాగకూడదు:
టీ, కాఫీలను అస్సలు అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని బదులుగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, లస్సీ, మజ్జిగ తాగుతూ ఉండండి.. ఇలా చేయడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. అంతేకాకుండా శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.
మందుల విషయంలో జాగ్రత్త వహించండి:
చాలా మంది ఆధునిక జీవన శైలికారణంగా వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే మధుమేహం వారు తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటించే క్రమంలో తప్పకుండా వీరు రోజూ వేసుకునే మందులను వేసుకోవాలి. ఇలా చేయ్యడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
వేయించినవి తినడం మానుకోండి:
నవరాత్రిల్లో తీసుకునే ఆహారంలో చాలా వరకు వేయించినవి ఉంటాయి. అయితే వీటిని అస్సలు ఆహారంగా వినియోగించవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి మధుమేహాన్ని పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Nagarjuna: సినీ నటుడు నాగార్జున రాజకీయాల్లో వస్తున్నారా..? ఆయన ఏమన్నారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.