Healthy Monsoon Diet for Kids: వానా కాలంలో పిల్లలకు వీటిని అస్సలు పెట్టొద్దు..!

Monsoon Diet for Kids: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం ప్రారంభమైంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. దీని కారణంగా సూక్ష్మాజీవులు కూడా వాతావరణంలో విస్తారంగా విస్తరిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 05:29 PM IST
  • వానా కాలంలో పిల్లలకు చీజ్, బెర్రీలు తినిపించవద్దు
  • నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినిపించండి
  • పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు
Healthy Monsoon Diet for Kids: వానా కాలంలో పిల్లలకు వీటిని అస్సలు పెట్టొద్దు..!

Monsoon Diet for Kids: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం ప్రారంభమైంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. దీని కారణంగా సూక్ష్మాజీవులు కూడా వాతావరణంలో విస్తారంగా విస్తరిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పెద్దలకే కాకుండా చిన్న పిల్లల్లో కూడా కూడా ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలు రాకుండా పలు రకాల ఆహారాలపై శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణలు తెలుపుతున్నారు. ఈ నియమాలు పాటించడం వల్ల వర్షా కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్(Soaked dry fruits) :

వానా కాలంలో పిల్లలకు ఉదయం పూట తాజా పండ్లను లేదా కుంకుమ పువ్వులో నానబెట్టిన బాదం, నానబెట్టిన నల్ల ఎండుద్రాక్షను పాలు తాగడానికి ముందు తినడానికి ఇవ్వండి. ఇలా రోజూ ఇవ్వడం వల్ల ఇది పిల్లలో శక్తి స్థాయిని పెంచడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రభావవంతంగా ఉంటాయి. బాదంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను శరీరంలో ఏర్పాటు చేస్తాయి.

 ఉసిరికాయ(Amla):

ఉసిరికాయలో విటమిన్ సి అధిక పరిమాణంలో ఉండడం వల్ల అంటువ్యాధులతో పోరాడడానికి కృషి చేస్తుంది. తలనొప్పి సమస్యలను దూరం చేస్తుంది. కావున వీటితో తయారు చేసిన ఫుడ్‌ను పిల్లలకు పెట్టాలని ఆరోగ్యనిపుణలు సూచిస్తున్నారు.  అంతే కాకుండా ఉసిరికాయతో చేసిన మిఠాయిలు కూడా పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.

చీజ్, బెర్రీలను(Cheese, berries) అస్సలు తినిపించవద్దు:

వానా కాలంలో పిల్లలకు కేవలం లోకల్‌ లభించే ఆహారాలను మాత్రమే తినిపించాలి. ముఖ్యంగా చీజ్, బెర్రీలు, చట్నీలను అస్సలు పిల్లలకు ఇవ్వండి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉండవు. కావున వీటిని పిల్లలకు పెట్టక పోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  Weight loss In 5 Days: ఎన్ని చిట్కాలు పాటించిన బరువు తగ్గలేకపోతున్నారా.. అయితే ఇలా సుభంగా 5 రోజుల్లో క్యాబేజీతో బరువు తగ్గండి..!

Also Read:  Weight loss tips in 10 days: వీటితో తయారు చేసిన రొట్టెలను తింటే పది రోజుల్లో బరువు తగ్గుతారు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News