Low Sugar Symptoms: రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోతే ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి.. వెంటనే జాగ్రత్త వహించకపోతే..

Low Sugar Symptoms: షుగర్ వ్యాధిగ్రస్తులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించినట్లే రక్తంలో షుగర్ లెవెల్ తగ్గినప్పుడు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 31, 2024, 02:23 PM IST
Low Sugar Symptoms: రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోతే ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి.. వెంటనే జాగ్రత్త వహించకపోతే..

Low Sugar Symptoms: షుగర్ వ్యాధిగ్రస్తులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించినట్లే రక్తంలో షుగర్ లెవెల్ తగ్గినప్పుడు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. షుగర్ ఎక్కువ నార్మల్ తక్కువ మూడు ఉంటాయి. రక్తంలో షుగర్ పెరిగినా.. తగ్గినా ప్రమాదమే అందుకే ఎప్పటికీ ప్రతిరోజు రక్తంలో షుగర్ లెవల్స్‌ నియంత్రించుకోవాలి. సరైన జీవనశైలి ప్రధానంగా చూసుకోవాలి. అంతేకాదు రక్తంలో షుగర్ లెవల్స్ జరగకుండా ప్రతిరోజు షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. రక్తం లో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కొన్ని జాగ్రత్త తీసుకోవాలి. అయితే, రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా తగ్గినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

ఆకలి..
రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మీకు ఎక్కువ సమయం పాటు ఆకలి వేస్తుంది. తిన్న వెంటనే మళ్ళీ మళ్ళీ ఆకలి వేయడం  షుగర్ లెవెల్స్ పడిపోయాయని తెలిపే లక్షణం. చక్కర స్థాయిలో పెరిగినప్పుడు కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. ఇది తెలిసినా రక్తంలో చక్కెర స్థాయిలు చెక్‌ చేసుకుని జాగ్రత్త తీసుకోవాలి.

తలనొప్పి..
అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు తలనొప్పి కూడా వస్తుంది. షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు నోరోఫిఫ్రైన్, అడ్రినాలిన్ అనే కెమికల్స్ ని తారుమారవుతుంది. ఇది తలనొప్పికి కారణం అవుతుంది. మీరు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయానే షుగర్ తీసుకున్న కానీ వెంటనే తగ్గదు.

ఇదీ చదవండి:  స్ట్రాబెర్రీలు తింటున్నారా? అయితే, మీకు ఈ 5 రోగాలు దరిచేరవు..

ఏకాగ్రత కోల్పోవడం..
షుగర్ లెవెల్స్  తగ్గినప్పుడు ఏకాగ్రతగా ఏ పని చేసుకోలేరు. వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎక్కువ తీసుకున్నా కానీ ఇలా రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. డాక్టర్ల సలహా మేరకు సరైన మోతాదులో ఇన్సులిన్ తీసుకోవాలి

అతి నిద్ర..
హైపర్ గ్లైసేమియా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా నిద్ర ఎక్కువగా వస్తుంది. రాత్రి సరిగ్గా నిద్ర పోయినా కూడా పగలు కూడా ఆ నిద్ర మళ్ళీ వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు కార్యకలాపాలు కూడా చేసుకోలేక పోతారు. నిద్ర మత్తు ఉంటుంది. ఈ లక్షణం కనిపించిన వెంటనే చక్కెర స్థాయిలు తగ్గిపోయాయని గుర్తుంచుకోవాలి.

ఇదీ చదవండి: ఈ మండే ఎండలకు వేడి కాఫీ కాకుండా ఇలా కోల్డ్ కాఫీ తాగితే బోలెడు ప్రయోజనాలు..

నీరసం..
షుగర్ లెవెల్ స్థాయిలు పెరిగినప్పుడు నీరసం కూడా ఉంటుంది. సాధారణ పనులు కూడా చేయాలని పరిస్థితి. వీక్నెస్, శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చెక్ చేసుకోండి  తగ్గకపోతే ప్రమాద స్థాయికి చేరుకుంటుంది వెంటనే వైద్యులను సంప్రదించాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News