Side Effects Of Black Pepper: మనం వంటల్లో మసాలా దినుసులుగా మిరియాలను వాడతాం. దీనిని కింగ్ ఆఫ్ స్పైసెస్ అని కూడా పిలుస్తారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మిరియాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మిరియాల కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుకండా జలుబు, దగ్గు వంటి వైరల్ ఫీవర్స్ ను దూరం చేస్తుంది. మిరియాల్లో చాలా రకాల ఉన్నాయి. ఇవి నలుపు, తెలుపు, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగుల్లో లభిస్తాయి. బ్లాక్ పెప్పర్ లో పోషకాలు, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే నల్ల మిరియాలను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో... వీటిని పరిమితికి మించి తినడం వల్ల అన్నే దుష్ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
నల్ల మిరియాలు దుష్ప్రయోజనాలు
శ్వాస సమస్య
మీరు నల్ల మిరియాలను అధికంగా తీసుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే పరిమితికి మించి తీసుకోవడం వల్ల మీ ఆక్సిజన్ ప్రవాహం ప్రభావితమవుతుంది. దాని వల్ల మీరు సరిగ్గా ఊపిరి తీసుకోలేరు.
చర్మ వ్యాధులు
ప్రతి ఒక్కరూ తన చర్మం అందంగా మరియు మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. ఒక వేళ మీరు ఎక్కువగా మిరియాలను తిన్నట్లయితే అది మీ స్కిన్ పై ఉన్న నిగారింపును తొలగిస్తుంది. అంతేకాకుండా అది దురద, మంట మరియు దద్దుర్లు వంటి సమస్యలకు కారణమవుతుంది.
పోట్టలో వ్రణం
బ్లాక్ పెప్పర్ ను ఎక్కువగా తినే వారిలో ఉదర సమస్యలు వస్తాయి. దీని వల్ల మీ కడుపులో వ్రణం రావచ్చు. మీరు దీనిని అధిక పరిమాణంలో తీసుకోవాలనుకుంటే డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.
గర్భిణులకు నష్టం
గర్భిణులు వేడి వస్తువులను తినకూడదు. నల్ల మిరియాలను అధికంగా తినడం వల్ల మీరు చనుబాలివ్వడంలో ఇబ్బందులను ఎదుర్కోంటారు. దీని వల్ల మీ పిల్లలు కూడా సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు)
Also Read: Control Blood Pressure: ఇన్ఫెక్షన్లు, ఫ్లూ, బీపీకి ఒకే ఒక రోజులో ఈ జ్యూస్‌తో గుడ్ బై చెప్పొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook