Sleeping: నిద్రలో మీకు తెలియకుండా ఆ పనిచేస్తున్నారా..?.. మీరు డెంజర్ లో ఉన్నట్లే అంటున్న నిపుణులు..

Life Style: చాలా మంది నిద్రలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొందరు మాత్రం ముక్కుతో శ్వాస తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో నోరు తెరిచి శ్వాస తీసుకొవడం వంటికి మనం చూస్తుంటాం.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 11, 2024, 06:49 PM IST
  • - రాత్రిపడుకునే ముందు సెల్ ఫోన్ దూరంగా పెట్టాలి..
    - నోటితో శ్వాస తీసుకుంటే లాలా జలం ఎండిపోతుంది..
Sleeping: నిద్రలో మీకు తెలియకుండా ఆ పనిచేస్తున్నారా..?.. మీరు డెంజర్ లో ఉన్నట్లే అంటున్న నిపుణులు..

Breathing Problems At Night: మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్ర ఉండాలని డాక్టర్లుచెబుతుంటారు. కొందరు మాత్రం రాత్రిపూట కూడా సెల్ ఫోన్ లు చూసుకుంటూ సమయానికి నిద్రపోరు. సెల్ ఫోన్ లైట్ ల వల్ల కూడా కళ్లు పాడౌతుంటాయి. కొందరు నైట్ షిఫ్ట్ జాబ్ లు చేస్తుంటారు. దీంతో వీరి జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. ఫుడ్ అలవాట్లు, నిద్ర లేవడం, పడుకొవడం వంటి సమయాలు పూర్తిగా మారిపోతాయి. ఇది కూడా జీవక్రియలపై ప్రభావం చూపిస్తుంది.

Read More: Pani Puri Banned: నోరు ఊరించే పానీపూరీ ఈ దేశంలో బ్యాన్ అని తెలుసా?

సాధారణంగా కొంత మంది నిద్రలో ముక్కుతో కాకుండా..  నోరు తెరిచి శ్వాసను తీసుకుంటారు. శ్వాసలో ఇబ్బందుల వల్ల ఇలా చేస్తుంటారు. నోరు తో శ్వాసక్రియ జరపడం వల్ల కలుషితమైన గాలి నోటిలోకి వెళ్లిపోతుంది. అంతే కాకుండా.. నోటిలోని లాలా జలం కూడా ఎండిపోతుంది.  దీంతో పదార్థాలను గుర్తించే రుచిగుళికలు క్రమంగా, టెస్ట్ లను గుర్తించలేవు. నోటితో నేరుగా గాలిలోకి క్రిములు పొట్టలోకి వెళ్లడం వల్ల.. మైక్రో ఆర్గన్స్ పొట్టలోకి వెళ్లిపోతుంటాయి. దీంతో కడుపులో అనేక సమస్యలు  ఉత్పన్నమవుతాయి. ముక్కులో సాధారణంగా రెండు రంధ్రాలుంటాయి.

ఒకదానితో గాలిని తీసుకుని, ఆ తర్వాత కలుషితమైన గాలిని బైటకు వదిలిపెడుతుంటాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇంకా ముక్కుల ఉండే వెంట్రుకల వల్ల గాలిలో ఏదైన కలుషిత దుమ్ము,ధూళి కణాలుంటే అవి అక్కడే వెంట్రుకల్లో చిక్కుకుంటాయి. ముక్కు లోపలికి ప్రవేశించలేవు. కానీ నోటితో గాలిపీల్చుకునేవారిలో నేరుగా గాలి అనేది నోటిలోపలికి వెళ్లిపోతుంది. దీనితో వయస్సు పెరిగిన కొలగి అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. నిద్రలో నోటి నుంచి చాలా మందికి ఉమ్ము నిద్రలో పడిపోతు ఉంటుంది. ఇది చిన్నతనంలో కామన్ గా ఉంటుంది.

కానీ కొందరికి పెద్దవయస్సులో కూడా ఈ సమస్య ఉంటుంది. దీంతో తరచుగా నోరు తడారిపోవడం, దాహంగా అన్పించడం వంటివి కల్గుతుంటాయి. నిద్రపోయే ముందు చాలా మంది నీరు తాగడం చేయరు. కానీ ఇలా చేస్తే మాత్రం శరీరంలోని జీవన క్రియలలో అనేక మార్పులు వస్తాయి. శరీరంలో నుంచి చెడు పదార్థాలు చెమట రూపంలో ఎక్కువగా బైటకు వెళ్లిపోతుంటాయి. కానీ.. నీళ్లు శరీరానికి సరిపడంతా ఇవ్వకపోతే మాత్రం.. శరీరంలో నుంచి దుర్గందం వస్తుంది. కొందరికి విపరీతంగా చెమట పడుతుంది.

Read More: Mouni Roy: 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ కొత్త అవతారం.. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా..

ఇలాంటి వారు ఎక్కువగా నీటిని కోల్పోతుంటారు. అందుకే వీలైనంతా ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. ఉదయం నిద్రలేవగానే.. గొరువెచ్చని నీటిని తాగాలని వైద్యులు చెబుతుంటారు. దీంతో పొట్టపూర్తిగా క్లీన్ గా చేయడానికి ఉపయోగపడుతుందని, రాగి పాత్రలో రాత్రి పూట నీళ్లను పెట్టి ఉదయంపూట తాగితే మరిన్ని ఆరోగ్యలాభాలుంటాయని కూడా నిపుణులు చెబుతున్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News