Weight Loss: ఈ టీలను క్రమం తప్పకుండా తాగితే.. సులభంగా బరువు తగ్గుతారు..!

Lemon Tea For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వేగంగా బరువు తగ్గడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే  దీని కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ ఉత్పత్తులను వినియోగించకుండా కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 12:56 PM IST
  • దాల్చినచెక్క, నిమ్మ, అల్లం టీలను తాగాలి
  • వీటి వల్ల సులభంగా బరువు తగ్గుతారు
  • ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది
 Weight Loss: ఈ టీలను క్రమం తప్పకుండా తాగితే.. సులభంగా బరువు తగ్గుతారు..!

Lemon Tea For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వేగంగా బరువు తగ్గడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే  దీని కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ ఉత్పత్తులను వినియోగించకుండా కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. ఇంట్లో లభించే పలు రకాల వస్తువులతో కూడా బరువు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బరువు తగ్గానికి టీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీర బరువును నియంత్రించేందుకు దాల్చినచెక్క, నిమ్మ, అల్లంతో చేసిన టీని తాగొచ్చు. వీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు. కావున ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ టీలను తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

దాల్చినచెక్క, నిమ్మ, అల్లంలో థయామిన్, కాల్షియం, నియాసిన్, విటమిన్ సి, ఐరన్, జింక్, క్రోమియం వంటి పోషకాలుంటాయి. అంతేకాకుండా  ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి  ఊబకాయాన్ని తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరూంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
 
ఈ టీల వల్ల ప్రయోజనాలు:

1. బరువును నియంత్రిస్తుంది:

శరీర బరువును నియంత్రించేందుకు ఈ టీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శరీర బరువును నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీరంలో పెరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. కావునా రోజూ నిమ్మకాయ, అల్లంతో చేసిన టీ ఉదయం పూట తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బాడీని ఫిట్‌గా చేసేందుకు కూడా కృషి చేస్తుంది.

2. కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కావున ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పైన పేర్కొన్న టీలు సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం అల్లం టీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ టీలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

3. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది:

బరువును సమతుల్యంగా ఉంచుకోవడానికి ఈ టీలు సహాయపడతాయి. కావున శరీరంలో వివిధ రకాల వ్యర్థ పదార్థాలను నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కావున ఈ టీలను తప్పకుండా తీసుకోవాలి.

4. యాంటీ ఆక్సిడెంట్లు:

దాల్చిన చెక్క, అల్లం, లెమన్ టీలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.

Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం

Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News