Kismis Facts In Telugu: ఆరోగ్యంగా ఉండాలని ఎవరు అనుకోరు.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలని ప్రతిరోజు అనుకుంటారు. మీరు కూడా కలకాలం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటున్నారా? మనం రోజు శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండడానికి.. ఆహారాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది రాత్రిపూట అతిగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. నిజానికి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అదిగా ఆహారాలు తీసుకోవడం అంత మంచిది కాదు. అయితే లైట్ గా ఆహారాలు తీసుకుంటూ ఆరోగ్య నిపుణులు చెప్పినా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మన శరీరం ఉదయాన్నే ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా రాత్రిపూట తప్పకుండా ఎండు ద్రాక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రి ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ప్రతిరోజు ఎలాంటి ఆహారాలు తీసుకున్న ఎసిడిటి వంటి సమస్యలు వస్తున్నా వారు, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాత్రిపూట ఎండు ద్రాక్షను తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని మెలటోనిన్, ట్రిప్టోఫాన్, ఫోలేట్ స్థాయిలను ఒక్కసారిగా పెంచేందుకు ఎంతగానో సహాయ పడతాయి. అంతేకాకుండా నిద్రను ప్రేరేపించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ప్రతిరోజు ఎండు ద్రాక్ష ను తీసుకోవడం వల్ల నరాల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. తరచుగా నరాలు పట్టడం ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
రాత్రి నిద్ర పోవడానికి గంట ముందు 7 నుంచి 8 ఎండు ద్రాక్షలను తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు కంటి చూపులు మెరుగుపరచడమే కాకుండా రేచీకటి వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని పాలలో కలిపి తీసుకుంటే మరెన్నో లాభాలు పొందుతారు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి అంతేకాకుండా రక్తహీనత రక్తపోటు వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర రక్తహీనత రక్తపోటు వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా రక్తహీనత, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చక్కటి ఫలితాలను అందిస్తాయి.
ప్రతిరోజు ఇలా రాత్రిపూట ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఎండు ద్రాక్షలో సహజ చక్కెర లభిస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు ఇందులో ఉండే అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్లు అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధులనుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. రాత్రిపూట ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఇవే కాకుండా మరెన్నో లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.