Kidney Disease: కిడ్నీ దెబ్బతింటే ఈ లక్షణాలు తప్పకుండా వస్తాయా.. అసలు ఎలాంటి వాటిని రక్షించుకోవాలో తెలుసా..?

Kidney Disease: ప్రస్తుతం చాలా మందిలో కిడ్నీ సమస్యలు రావడం సర్వసాధారణమైయ్యాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు నియమాలు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 05:00 PM IST
Kidney Disease: కిడ్నీ దెబ్బతింటే ఈ లక్షణాలు తప్పకుండా వస్తాయా.. అసలు ఎలాంటి వాటిని రక్షించుకోవాలో తెలుసా..?

Kidney Disease: శరీరానికి కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఇవి బాడీలో ఫిల్టర్ వ్యవస్థ పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వ్యర్థాలను వడకట్టి బయటకు పంపించేందుకు కీలకంగా సహాయపడతాయి. ఒకవేళ శరీరంలో కిడ్నీలు పాడైపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చా అవకాశాలు ఉన్నాయి. బాడీలో టాక్సిన్స్ పరిమాణం పెరిగి కిడ్నీలు చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించి వారిచ్చే సలహాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు కొన్ని రకాల నియమాలు పాటించడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. 

మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి?
కిడ్నీల్లో లోపం ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. లోపం ఉందని తెలుసుకోవడానికి తప్పకుండా శరీరంపై వచ్చే లక్షణాలను గమనించాల్సి ఉంటుంది. అయితే ఆ లక్షణాలను ఎలా గమనించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

- చర్మం రంగు మరింత తెల్లగా మారుతుంది
- చర్మం చాలా పొడిగా మారుతుంది.
- గోళ్లలో తెల్లదనం రావడం మొదలవుతుంది 
- గోళ్లుబలహీనంగా మారడం ప్రారంభమవుతుంది
- దురద రావచ్చు.

కిడ్నీ దెబ్బతినకుండా నివారించడం ఎలా?
1. శరీర బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది:
శరీర బరువు పెరగడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి శరీర బరువును ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2. నిద్రలేమి సమస్యలు:
ప్రస్తుతం చాలామంది ఏడు నుంచి ఎనిమిది గంటల కంటే తక్కువగానే నిద్రపోతూ ఉంటారు అయితే ఇలా నిద్రపోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు 8 నుంచి 9 గంటలు నిద్రపోవడం చాలా మంచిది.

3. శారీరక కార్యకలాపాలు:
ప్రతిరోజు అరగంట పాటు తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. లేకపోతే కిడ్నీలలో సమస్యలు వచ్చి తీవ్ర వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతిరోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.

Also Read : Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!

Also Read : 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News