Joint Pain In Winter Remedies: జలుబు రాగానే చాలా మందికి కీళ్ల నొప్పులు మొదలవుతాయి. చలికాలంలో కీళ్ల నొప్పులు సమస్యలు అకస్మాత్తుగా వస్తాయి. ఇవి రావడానికి ప్రధాన కారణాలు చాలా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీనివల్ల శరీర బలహీనత సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా జంక్ ఫుడ్స్ వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు సులభంగా వస్తున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ నూనెలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ నూనెలతో కీళ్ల నొప్పులకు చెక్:
బాదం నూనె:
బాదం నూనెలో విటమిన్ ఇ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది ఎముకలను దృఢంగా చేయడమేకాకుండా.. శరీరాన్ని దృఢంగా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నూనెను గోరువెచ్చగా చేసుకుని నొప్పులు ఉన్న కీళ్లకు మసాజ్ చేస్తే సులభంగా ఉపశమనం లభిస్తుంది.
నువ్వుల నూనె:
నువ్వుల నూనెలో ఇతర నూనెల కంటే ఎక్కువ మాయిశ్చరైజర్ ఉంటుంది. అందుకే నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాపర్, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి గుణాలు ఉంటాయి. వీటిని వంటకాల్లో వినియోగిస్తే సులభంగా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
కొబ్బరి నూనె:
చలి కాలంలో తలనొప్పి, శరీర నొప్పి, కీళ్ల నొప్పుల సమస్యలు చలి కాలంలో ఎక్కువగా వస్తాయి. అయితే ఈ నొప్పుల నుంచి సులభంగా కొబ్బరి నూనె వినియోగించి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.
ఆవనూనె:
మస్టర్డ్ ఆయిల్ వాపులు, నొప్పిల నుంచి సులభంగా వేగంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆవనూనెలో వెల్లుల్లి రెబ్బలను వేసి మసాజ్ చేస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ నెప్పులు కూడా సులభంగా తగ్గుతాయి.
Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?
Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook