Valentines Day: వాలెంటైన్ డే.. అందరికీ సుపరిచితమైన ప్రేమికుల దినం. ఇది ఒకరోజు కాదు వారం రోజులపాటు ఉంటుంది. వాలంటైన్ వారంలో ఏ రోజు ఏముంటుందనేది చూద్దాం.
వాలంటైన్ వారం రేపు అంటే ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ప్రతియేటా ఫిబ్రవరి నెలంటే వారంటైన్స్ డే గుర్తొస్తుంటుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమై..14తో ముగుస్తుంది. వాలంటైన్ డే అంటే గుర్తొచ్చేది ఎర్రటి గులాబీలు కూడా. ఎరుపు రంగుతో డామినేట్ చేసే గులాబీల్ని చూడగానే..మీ మనస్సు కూడా రొమాంటిక్ కాక తప్పదు. ఫిబ్రవరి 7 తేదీన రోజ్ డే, 8వ తేదీన ప్రపోజ్ డే, 9వ తేదీన చాకొలేట్ డే, 10 వతేదీన టెడ్డీ డే ,11వ తేదీన ప్రామిస్ డే, 12 వ తేదీన హగ్ డే, 13వ తేదీన కిస్ డే, 14వ తేదీన వాలంటైన్స్ డేగా జరుపుకుంటారు.
ప్రేమకు ప్రతిరూపంగా సెయింట్ వాలెంటైన్‌కు గుర్తుగా వాలెంటైన్ డే (Valentine Day) జరుపుకుంటారు. వాస్తవానికి క్రిస్టియన్ కేలండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ..ఇప్పుడు అన్ని దేశాల్లో ప్రాచుర్యం పొందింది. వాలెంటైన్ డే జరుపుకునేందుకు చాలా మార్గాలుంటాయి. విభిన్న ఉపాయాలుంటాయి. ప్రేమించివారికి విషెస్ తెలిపేందుకు విభిన్న మార్గాలుంటాయి. అందమైన సందేశాల రూపంలో, ట్రీట్ రూపంలో, గిఫ్ట్స్ రూపంలో, అందమైన గులాబీలు ఇచ్చుకుంటూ ఎలాగైనా, ఏదో ఒక రూపంలో జరుపుకోవడం ఓ ఆనవాయితీ.
Also read: Lata Mangeshkar: లతాకు పేరు తెచ్చిన పాట..చివరి పాట కూడా ఇండియన్ మిలట్రీపైనే..యాధృచ్ఛికమా కాదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook