Mosquitoes Bite Reason: దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా?

Mosquitoes Bite Reason: దోమలు కుట్టడం మామూలే. అయితే మనలో కొంత మందినే దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయి. దీని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2022, 10:59 AM IST
Mosquitoes Bite Reason: దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా?

Mosquitoes Bite Reason: మనలో చాలా మంది దోమలు తమనే ఎక్కువగా ఎందుకు కుడతాయని ప్రశ్నించుకుంటారు. అయితే ఈ విషయంలో దోమలకేమి పక్షపాతం ఉండదు. కానీ దీని వెనుక సైన్సు ఉందంటారు కొందరు. మనకు నచ్చిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నట్లే... దోమలు (Mosquito Bites) కూడా వాటికి నచ్చిన తిండిని ఎంచుకుంటాయి. దోమలను ఆకర్షించే అంశాలేంటి, దీని వెనుక కారణాలేంటే ఇప్పుడు తెలుసుకుందాం. 

దోమలు కుట్టడానికి కారణం

రక్తం (Blood): దోమలకు రక్తమంటే చాలా ఇష్టమని చాలా మంది చెబుతారు. అందులో కొంత వాస్తవం ఉంది. దోమలు కొన్ని  రక్త వర్గాలకు చెందిన వారిని కుట్టడానికే ఇష్టపడతాయి. ముఖ్యంగా దోమలు ‘'O' బ్లడ్ గ్రూప్’ వర్గానికి చెందిన వారినే ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

వాసన (Smell): శరీర వాసనకు కూడా దోమలు ఆకర్షితులవుతాయి. అంటే పెర్ఫ్యూమ్ వాడేవారిని  దోమలు కుట్టవని అర్థం కాదు. శరీర చెమట అమ్మోనియా మరియు లాక్టిక్ యాసిడ్ వంటి అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉంటుంది, ఇది దోమలను విపరీతంగా ఆకర్షిస్తుంది. 

బాక్టీరియా (Bacteria): బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న చోట దోమలు ఎక్కువగా ఉంటాయి. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. ఒక పరిశోధన ప్రకారం, దోమలు మన పాదాలను ఎక్కువగా కుడతాయి, ఎందుకంటే పాదాలలో బ్యాక్టీరియా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కార్బన్ డయాక్సైడ్ (CO2): దోమలు కార్బన్ డయాక్సైడ్ కు ఎట్రాక్ట్ అవుతాయి. ఎక్కువ సేపు ఊపిరి పీల్చుకుంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుట్టడానికి ఇష్టపడతాయి.

జీవక్రియ రేటు (metabolic rate): మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. గర్భిణీ స్త్రీలు అధిక జీవక్రియ రేటును కలిగి ఉంటారు, కాబట్టి వారు దోమ కాటుకు గురవుతారు. 

Also Read: Ayurveda for hair: నల్ల మిరియాల మిశ్రమంతో కూడా ఈ జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo

Trending News