Hair Fall Remedies: ఈ ఇంటి చిట్కాలతో హెయిర్​ లాస్​ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు!

Tips To Stop Hair Fall: నేటికాలంలో చాలా మంది హెయిర్‌ లాస్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని కోసం మందులు, ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2024, 01:55 PM IST
Hair Fall Remedies: ఈ ఇంటి చిట్కాలతో  హెయిర్​ లాస్​ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు!

Tips To Stop Hair Fall: ప్రస్తుతకాలంలో చాలా మంది విపరీతంగా జుట్టు ఊడిపోయే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రకాల షాంపులు, నూనెలు, ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నారు.  అయితే వీటిలో ఉపయోగించే కెమికల్స్‌ కారణంగా జుట్టు మరిత ఊడిపోయే ఛాన్స్‌లు అధికంగా ఉంటుంది. ఎలాంటి ప్రొడెక్ట్స్‌, క్రీములు సహాయం లేకుండా ఇంట్లోనే కొన్ని సహజమైన పదార్థాలను ఉపయోగించి జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. 

జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టురాలే సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కెరాటిన్, విటమిన్‌- బీ 7, ఐరన్‌, జింక్‌, మినరల్స్‌ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం నాలుగు నిమిషాలు పాటు మసాజ్‌ చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు  కలుగుతాయి. ముఖ్యంగా వెంట్రుకలు కుదుళ్లు బల్లంగా, ఆరోగ్యంగా తయారువుతాయి. దీంతో పాటు  వెంట్రుకలు రక్తప్రసరణ జరుగుతుంది. కలబందను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. మీ జుట్టుకు కలబంద ఎంతో మేలు చేస్తుంది. 

దీంతో పాటు గుడ్డు మాస్క్‌ చాలా మంచిది. గుడ్డులో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. దీంతో పాటు బయోటిన్‌, ఫోలేట్‌, విటమిన్‌ ఏ,డీ లు కూడా ఉంటాయి. ఇవి జుట్టుకు ఎంతో ఉపయోగపడుతాయి. మీ జుట్టు స్కాల్ప్‌, హెయిర్‌ ఫోలీకల్స్‌కు ఎంతో సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా పెంచడంలో గ్రీన్‌ టీ కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కాటెచిన్లు, డైహైడ్రోటెస్టోస్టెరాన్ జుట్టు సహాయపడుతుంది. నీలగిరి నూనెను శనగపప్పు నూనెతో కలిపి తలకు రాసుకుని మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు బలంగా ఉండాలి అంటే ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు A, B, C, D, E కలిగిన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం దీంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు వంటివి తినడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. 

జుట్టు సంరక్షణ:

మీ జుట్టు రకానికి సరిపోయే షాంపూ, కండీషనర్ ఉపయోగించండి.

వారానికి 2-3 సార్లు మాత్రమే జుట్టును కడగండి.

జుట్టును చాలా వేడిగా డ్రై చేయవద్దు.

జుట్టును తరచుగా రంగు వేయవద్దు లేదా స్ట్రెయిట్ చేయవద్దు.

బ్రష్ చేసేటప్పుడు లేదా తడిసిన జుట్టును విప్పుతున్నప్పుడు జుట్టును జాగ్రత్తగా చూసుకోండి.

రాత్రి పడుకునేటప్పుడు జుట్టును ముడివేసి పడుకోండి.
 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News