Silky Smooth Hair: జుట్టు సిల్కీగా కావాలని పార్లర్‌కు వెళ్తున్నారా? అవసరంలేదు ఇలా చేస్తే ఇంట్లోనే తళతళా మెరిసిపోతుంది..

Silky Smooth Hair Remedies: జుట్టు అందంగా మెరుస్తూ కనిపించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఒక కప్పు చల్లని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా వేసి షాంపూ కండిషనర్ చేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ జుట్టుకు 15 నిమిషాలు పాటు అప్లై చేసుకోవాలి

Written by - Renuka Godugu | Last Updated : Aug 7, 2024, 06:49 AM IST
Silky Smooth Hair: జుట్టు సిల్కీగా కావాలని పార్లర్‌కు వెళ్తున్నారా? అవసరంలేదు ఇలా చేస్తే ఇంట్లోనే తళతళా మెరిసిపోతుంది..

Silky Smooth Hair Remedies: జుట్టు అందంగా మందంగా కాకుండా మెరుస్తూ కూడా కనిపించాలి అని కూడా చాలామంది అనుకుంటారు. దీంతో జుట్టు అందం రెట్టింపు కనిపిస్తుంది. అయితే పార్లర్ కి వెళ్లి వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సులభంగా జుట్టును సిల్కీగా సింపుల్‌గా మార్చుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? ఈజీగా ఒక 7 రెమెడీస్ తో మీ జుట్టు ఇంట్లోనే సిల్కీగా మార్చేయవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం

కలబంద జెల్ స్ప్రే..
మీ జుట్టు అందంగా మార్చుకుని, సిల్కీగా మెరుస్తూ కనిపించాలంటే కలబంద ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. కలబందను నీటిలో వేసి ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. దీన్ని వారంలో ఒక నాలుగు సార్లు జుట్టుకు స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా మారిపోతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ వాష్..
జుట్టు అందంగా మెరుస్తూ కనిపించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఒక కప్పు చల్లని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా వేసి షాంపూ కండిషనర్ చేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ జుట్టుకు 15 నిమిషాలు పాటు అప్లై చేసుకోవాలి ,ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

అరటిపండు హెయిర్ మాస్క్..
జుట్టు సిల్కీగా కనిపించడానికి అరటిపండు బెస్ట్ హోమ్ రెమెడీ. ఇది జుట్టును మృదువుగా మార్చి మెరిసేలా చేస్తుంది. అరటిపండును బాగా మ్యాష్ చేసి అందులో రెండు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని చుట్టుకుని అంతటికి పట్టించి ఓ అరగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.

కాఫీ క్లెన్సర్..
కాఫీ కూడా జుట్టు సిల్కీగా కనిపించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. కాఫీ జుట్టుకు మాయిశ్చర్‌ని అందిస్తుంది. ఈ కాఫీ ని స్ప్రే మాదిరి తయారు చేసుకుని జుట్టు అంతటికీ స్ప్రే చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: తెల్ల వెంట్రుకలను శాశ్వతంగా నల్లగా మార్చే పెప్పర్ హెయిర్ డై ఇలా సింపుల్ గా చేసుకోండి..

ఎగ్ వైట్..
ఎగ్ వైట్ లో కూడా జుట్టుని ఆరోగ్యంగా మెరిపించే గుణం ఉంటుంది. దీంతో జుట్టు సిల్కీ గా మారిపోతుంది, ఎగ్ వైట్ లో జుట్టు అంతటికి పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి ఇది వారానికి ఒకసారి చేసిన ఎఫెక్టివ్ ఫలితాలు కనిపిస్తాయి.

 షియా బటర్..
షియా బట్టర్ జుట్టుకు మాయిశ్చర్‌ను అందిస్తుంది. కుదుళ్ల నుంచి హెయిర్ ఆరోగ్యంగా ఉంచుతుంది. షియా బటర్ లో ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకొని జుట్టుకు బాగా పట్టించి ఒక గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.

ఇదీ చదవండి: మీ ఫ్రెండ్స్ తో ఒక్కసారైనా రోడ్ ట్రిప్ వెళ్లాల్సిన టాప్ 7 రోడ్డు మార్గాలు ఇవే..

రోజ్మెరీ ఆయిల్..
రోజ్మెరీ ఆయిల్ కూడా జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది జుట్టు అంతటికీ పట్టించి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు తలస్నానం చేసుకోవాలి దీంతో ప్రభావంతమైన ఫలితాలు కనిపిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News