Fridge Cleaning: ఫ్రిజ్‌ వాసన రాకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

Fridge Cleaning Tips:  బేకింగ్ సోడా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటుంది దీంతో ఇంటిని శుభ్రంగా ఉపయోగించవచ్చు. పలు విధాలుగా బేకింగ్ సోడాను ఉపయోగించి ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. బేకింగ్ సోడా కంటైనర్ ఫ్రిజ్ ను ఓపెన్ చేసి పెట్టాలి.

Written by - Renuka Godugu | Last Updated : Aug 10, 2024, 06:00 PM IST
Fridge Cleaning: ఫ్రిజ్‌ వాసన రాకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

Fridge Cleaning Tips: ఇంట్లో ఫ్రిజ్ ను విపరీతంగా ఉపయోగిస్తాము. ప్రతి ఆహారం ఫ్రిజ్లో పెడతాము, కూరగాయలు పాడవ్వకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేలా చేస్తుంది. వండిన వంటలు కూడా ఫ్రిజ్లో పెట్టే అలవాటు ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు దుర్గంధం వచ్చినట్లు మీరు గమనించారా? ఇది ఎందుకో తెలుసా? అయితే ఫ్రిడ్జ్ ఎలా శుభ్రం చేసుకోవాలో ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఎలా ఉండేలా చూసుకోవాలో తెలుసుకుందాం.

బేకింగ్ సోడా..
బేకింగ్ సోడా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటుంది దీంతో ఇంటిని శుభ్రంగా ఉపయోగించవచ్చు. పలు విధాలుగా బేకింగ్ సోడాను ఉపయోగించి ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. బేకింగ్ సోడా కంటైనర్ ఫ్రిజ్ ను ఓపెన్ చేసి పెట్టాలి. ఇది ఫ్రిజ్లో ఉండే వాసనను పీల్చుకుంటుంది. ఎక్కువ రోజులపాటు నిల్వ ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది ప్రతి మూడు నెలకోసారి ఈ కంటైనర్ను మారుస్తూ ఉండాలి.

చార్కోల్..
బేకింగ్ సోడా మాదిరి చార్కోల్ కూడా ఇలాగే ఉపయోగపడుతుంది. చార్కోల్ ఫ్రిజ్‌ దుర్గందాన్ని పీల్చుకుంటుంది. ఒక బౌల్ లో  యాక్టివేటెడ్‌ చార్కోల్ పెట్టుకోవాలి.

సీట్రస్..
ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్గం దానికి సీట్రస్ కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీ. లెమన్, ఆరెంజ్ వంటివి దుర్గందాన్ని పీల్చేసుకుంటాయి. ఒక షెల్ఫ్‌లో కంటైనర్ లో సీట్రస్ పండు తొక్కలను వేసి పెట్టుకోవాలి. లేకపోతే సగం కట్ నిమ్మ కాయను కట్ చేసి కూడా ఒక సెల్ఫ్ లో పెట్టుకోవడం వల్ల దుర్వాసన పోతుంది.

ఇదీ చదవండి:  చాట్ మసాలా ఇలా ఇంట్లో తయారు చేసుకునే విధానం.. ఎంతో టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది..

కాఫీ..
గ్రౌండ్  కాఫీ కూడా ఫ్రిజ్లో ఉండే దుర్వాసనను పీల్చుకుంటుంది. ఒక కంటైనర్ లో కాఫీ పొడి వేసి దాన్ని ఓపెన్ చేసి పెట్టాలి ఇలా చేయడం వల్ల దుర్గంధం పీల్చుకుంటుంది.

వెనిగర్..
ఫ్రిజ్లో వెనిగర్ పెట్టుకోవడం వల్ల కూడా దుర్గంధం పీల్చుకుంటుంది. వైట్ వెనిగర్ ఫ్రిజ్లో వచ్చే దుర్గందాన్ని పీల్చేసుకుంటుంది ఒక గిన్నెలో పోసి ఫ్రిజ్లో పెట్టాలి.

ఆరెంజ్ తొక్కలు
ఆరెంజ్ ను కట్ చేసి లేకపోతే ఆరెంజ్ తొక్కలను కూడా పెట్టవచ్చు అలాగే నిమ్మ తొక్కలను కూడా కట్ చేసి ఫ్రిజ్లో నిల్వ ఉంచటం వల్ల ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్గంధం పోతుంది.

ఇదీ చదవండి: కొబ్బరినూనెలో ఈ ఆకు కలిపి రాస్తే తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోతుంది..

క్లీన్..
ఇలా చేయడంతో పాటు మీ ఫ్రిడ్జ్ ని రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి అంతే ఎక్స్పైర్ అయిన ఫుడ్ ను తీసేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఫ్రిజ్ పాడవకుండా ఉంటుంది ఎక్కువ కాలం పాటు సువాసన భరితంగా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News