Homeremedies For Dewy Skin: ముఖం అందంగా మెరుస్తూ కనిపించాలని అందరూ కోరుకుంటారు. దీనికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకే పార్లర్లకు వెళ్లి వేల ఖర్చు పెడతారు. ముఖ్యంగా పెళ్లిళ్లకు వెళ్లే ముందు ఈ ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటే అందంా మెరిసిపోతారు. అంతేకాదు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల డల్ స్కిన్ కు జీవం పోసినట్లు అనిపిస్తుంది. అయితే కాఫీ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖ రంగు మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది మెరిసేలా ప్రేరేపిస్తుంది
బ్యూటీ రొటీన్ లో కాఫీ ఫేస్ ప్యాక్ చేయించుకోవడం ఒక గొప్ప ప్రయోగం. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది అంతేకాదు వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ కూడా ఈవెన్ స్కిన్ టోన్ అందించి కాంతివంతంగా మారుస్తాయి.
కాఫీ, తేనె..
తేనెల మాయిశ్చరై జింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది కాఫీతో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ ముఖం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.
కాఫీ, పెరుగు..
ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు, కాఫీ పొడి తీసుకొని వేసి బాగా పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది ముఖం మెడ భాగానికి అప్లై చేసి ఒక పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేయాలి.
ఇదీ చదవండి: విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..
కాఫీ పౌడర్ కొకోవా, కొబ్బరి నూనె
ఒక బౌల్లో ఈ మూడిటిని కలిపి మిక్స్ చేసి ముఖానికి పేస్టు మాదిరి తయారుచేసుకొని అప్లై చేసుకోవాలి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని వాష్ చేయాలి ఆ తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి.
కాఫీ, కలబంద..
కలబంద అంటేనే మాయిశ్చరైజింగ్, చర్మాన్ని నయం చేసే గుణాలు కలిగి ఉన్నది. కాఫీలతో చర్మం పునరుజ్జీవనం అందిస్తుంది. ఇది ఎక్స్పోలియట్ గుణాలు కలిగి ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ తో చర్మం రిలాక్స్ అవుతుంది. కలబంద ముఖానికి అప్లై చేయడం వల్ల చల్లదనం అందుతుంది. మంట సమస్య కూడా తగ్గుతుంది.
ఇదీ చదవండి: కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతోందా? బామ్మల కాలం నాటి అద్భుత చిట్కా..
కాఫీ, పసుపు పాలు..
కాఫీ తో పాటు పసుపు పాలు కలిపి అప్లై చేయడం వల్ల స్కిన్ కాంతివంతంగా మారడమే పాటు ఈవెన్ స్కిన్ టోన్ కూడా అందుతుంది. పాలలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తుంది ఇక పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి చర్మానికి గోల్డెన్ రంగు అందిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.