Holi Festival Precautions: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హోలీ జరుపుకోకపోవడమే మంచిది!

Holi Festival Precautions: హోలీ రోజున రంగులు చల్లుకునేందుకు ఏడాదంతా వేచి చూసే వారుంటారు. ఈ పండుగ రోజున ప్రజలందరూ తమ బాధలను మర్చిపోయి.. సంతోషంగా రంగులను చల్లుకుంటారు. అయితే హోలీ రోజున రంగుల చల్లుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు రావొచ్చని వైద్యులు అంటున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు హోలీ పండుగలో పాల్గొనకపోవడమే మంచిదని చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 12:29 PM IST
    • మార్చి 18న దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు
    • రంగుల పండుగకకు సిద్ధమైన దేశ ప్రజలు
    • చర్మ వ్యాధులతో బాధపడే వారు వేడుకల్లో పాల్గొనవద్దని వైద్యుల సూచన
Holi Festival Precautions: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హోలీ జరుపుకోకపోవడమే మంచిది!

Holi Festival Precautions: హోలీ అంటే రంగుల పండుగ. ఆరోజున పిల్లల నుంచి పెద్దల వరకు రంగులలో మునిగితేలుతారు. ఈ రోజంతా ఎంతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే వివిధ రంగులను శరీరంపై చల్లుకోవడం సహా వాటిలో ఉన్న కెమికల్స్ కారణంగా శరీరంపై చెడుప్రభావం చూపవచ్చు. అప్పటికే చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రంగుల చల్లుకోవడం నుంచి దూరంగా ఉంటే మంచిది. లేదంటే వాటి సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.  

హోలీ రంగుల వల్ల కలిగే చర్మ సమస్యలు..

1) ఫంగల్ ఇన్ఫెక్షన్

ఒక వ్యక్తికి చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య కారణంగా దురద, ఎరుపు దద్దుర్లు, చర్మంపై మంట వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అలాంటి సమస్యలను ఎదుర్కొనే వారు హోలీ నుంచి దూరంగా ఉంటే మంచిది. లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మరింత పెరగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

2) రింగ్వార్మ్ (తామర)

ఒక వ్యక్తి తన చర్మంపై రింగ్వార్మ్ (తామర) సమస్యలతో బాధపడే వారు హోలీ రోజు రంగులు చల్లుకోకుండా ఉంటే మంచిది. రింగ్‌వార్మ్‌ను హెర్పెస్ జోస్టర్ అని కూడా అంటారు. అయితే ఈ సమస్యతో బాధపడే వారు శరీరంపై రంగులు చల్లుకుంటే అది మరింత ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మంపై తామర కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. 

3) సోరియాసిస్

సోరియాసిస్ సమస్య ఉన్నా కూడా హోలీ రంగులకు దూరంగా ఉంటే మంచిది. సోరియాసిస్ సమస్య సమయంలో.. ఒక వ్యక్తి చర్మం దురద, పొలుసులు మొదలైన వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో హోలీ రంగులు ఈ సమస్య మరింత తీవ్రతరం కావొచ్చు. 

Also Read: Cholesterol Symptoms: అధిక కొలెస్ట్రాల్ కారణంగా మీలో ఈ భయంకరమైన లక్షణాలను గమనించారా?

Also Read: Earning Money: రూ.399 ఖర్చుతో ప్రతినెలా లక్షల రూపాయలను సంపాదించవచ్చు- అదెలాగో తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News