Holi 2021 Skin Care: హోలీ పండుగతో జర జాగ్రత్త, ఏమేం పాటిస్తూ హోలీ జరుపుకోవాలంటే

Things To Remember During Holi Festival | కొందరికి జట్టు రాలడం, ముఖానికి మొటిమలు, మచ్చలు లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో జరుపుకోనున్న హోలీ పండుగ వేళ చాలా జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 27, 2021, 04:37 PM IST
  • రంగు రంగుల పండుగ హోలీ వచ్చేసింది
  • కొందరికి జట్టు రాలడం, ముఖానికి మొటిమలు లాంటి ఎన్నో సమస్యలు
  • హోలీ పండుగలో పాల్గొనాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి
Holi 2021 Skin Care: హోలీ పండుగతో జర జాగ్రత్త, ఏమేం పాటిస్తూ హోలీ జరుపుకోవాలంటే

రంగు రంగుల పండుగ హోలీ వచ్చేసింది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, డబుల్ మ్యూటెంట్ రకం వైరస్ ఉన్న కారణంగా ఈ హోలీ పండుగ చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి. కొందరికి జట్టు రాలడం, ముఖానికి మొటిమలు, మచ్చలు లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో జరుపుకోనున్న హోలీ పండుగ వేళ చాలా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. పైగా కరోనా వైరస్ వ్యాప్తికి కోవిడ్19 నిబంధనలు సైతం పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హోలీ పండుగలో పాల్గొనాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి..
- కళ్లల్లోకి రంగు వెళ్లకుండా ఏదైనా అద్దాలు ధరించి హోలీ ఆడాలి. లేనిపక్షంలో కళ్లల్లోకి రంగు వెళ్లి కంటి చూపుపై సైతం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.

- మీ తల వెంట్రుకలు రాలుతున్నాయా(Hair Care), ఈ సమస్యతో బాధపడేవారు కచ్చితంగా తలకు ఏదైనా గుడ్డగానీ లేదా టోపీ ధరించడం ఉత్తమం.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

- చర్మ సంబంధమైన చికిత్స చేయించుకున్న వారు అప్పుడే రంగుల జోలికి వెళ్లకూడదు. దానివల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారు.

- సహజసిద్ధమైన, ఆర్గానిక్ కలర్స్‌తో హోలీ ఆడటం బెటర్. ఆర్టిఫీషియల్ రంగులతో హోలీ ఆడితే అవి చర్మానికి(Skin Care) అతుక్కపోయి మంట, చిరాకు పుట్టిస్తాయి.

- పాత దుస్తులు ధరించి రంగుల పండుగను ఎంజాయ్ చేయండి. లేకపోతే మీ కొత్త దుస్తులు వేసుకుని ఎక్కడికి వెళ్లలేరు. పాత దుస్తులు అయితే వాటిని తీసివేయవచ్చు.

Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే

- రంగులు పూర్తిగా ఎండిపోక మునుపే వాటిని శుభ్రంగా కడుక్కుని వదిలించుకునే ప్రయత్నం చేయాలి.

- చర్మానికి కొబ్బరినూనె లాంటికి రాసుకుని హోలీ వేడుకల్లో పాల్గొనాలి. అప్పుడు మీ శరీరానికి అంటిన రంగు కడిగినప్పుడు త్వరగా పోతాయి.

- మొటిమలు, ముఖంపై మచ్చలు, దద్దుర్లు లాంటి సమస్యలతో బాధపడేవారు హోలీ ఆడకపోవడమే మంచిది. లేకపోతే వారి సమస్య మరింత పెద్దదిగా మారే అవకాశాలున్నాయి.

- అసలే కరోనా సెకండ్ వేవ్ సమయం కనుక గుంపులు గుంపులుగా ఏర్పడి హోలీ ఆడవద్దు. మాస్కులు సైతం ధరించి భౌతిక దూరం పాటిస్తూ రంగుల పండుగ జరుపుకోవాలి.

Also Read: Benefits Of Pranayama: ప్రాణాయామం చేస్తే ఈ సమస్యలు పరార్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News