Food To Control High Cholesterol, Blood Sugar Level: చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది దీని కారణంగా గుండెపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలక వ్యాధులకు గురవుతున్నారు. అయితే ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే పలు రకాల చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల రక్త పోటు సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి...
కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గడానికి బెండకాయను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది:
లేడీ ఫింగర్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇందులో పెక్టిన్ మూలకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలుసా?:
లేడీ ఫింగర్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆహారంలో లేడీ ఫింగర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటిన్లు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా సులభంగా దీర్ఘకాలీక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Puja Banerjee Bareback Photo: బ్యాక్ మొత్తం కనిపించేలా పూజా హాట్ ట్రీట్.. చూశారా?
Also Read: Sravanthi Chokarapu on Exposing: నా బట్టలు నా ఇష్టం.. మీకేంటి నొప్పి అంటున్న స్రవంతి చొక్కారపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook