/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Herbal Tea: హెర్బల్ టీలో శరీరానికి మెలు చేసే చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. అందుకే ప్రస్తుతం వీటిని విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. అయితే ఈ టీలను చాలా మంది అతిగా వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెర్బల్ టీలను విచ్చల విడిగా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పొట్టలో వాపులు, నొప్పులు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కావున వీటిని అతిగా తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హెర్బల్ టీ దుష్ప్రభావాలు:

1. జీర్ణక్రియ దెబ్బతినడం:
హెర్బల్ టీలను క్రమం తప్పకుండా తీసుకోవడం శరీరంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో పొట్టలో సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కావున హెర్బల్ టీను అతిగా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు.

2. గర్భధారణకు హాని కలుగొచ్చు:
గర్భిణీ స్త్రీలు హెర్బల్ టీని తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. కావున వీరు ఈ టీలను అతిగా తీసుకోవడం మానుకోండి. లేకపోతే గర్భధారణ సమయంలో రక్త ప్రవాహం పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ టీలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.

3. మూత్రపిండాలకు హాని కలిగించొచ్చు:
ఇంతకముందే కిడ్నీసమస్యలతో ఇబ్బంది పడుతుంటే..హెర్బల్ టీలను తీసుకోవడం మానుకోండి. ఈ టీలను అతిగా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశాలున్నాయి.

4. గుండెల్లో మంటలు:
హెర్బల్ టీని అధిక మోతాదులో తీసుకుంటే.. గుండెల్లో మంట సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఈ టీలో ఆమ్లత్వ పరిమాణం అధిక పరిమాణంలో ఉంటాయి. కావున వీటిని అతిగా తీసుకుంటే గుండెల్లో మంట పుట్టే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:  Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం

Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Herbal Tea: If Herbal Tea Is Drink Regularly Pregnancy Problems Will Occur And Digestion Will Affected
News Source: 
Home Title: 

Herbal Tea: ఈ టీలను అతిగా తాగుతున్నారా.. శరీరానికి ప్రమాదమే..!

Herbal Tea: ఈ టీలను అతిగా తాగుతున్నారా.. శరీరానికి ప్రమాదమే..!
Caption: 
Herbal Tea: If Herbal Tea Is Drink Regularly Pregnancy Problems Will Occur And Digestion Will Affected(Source: ZEETELUGUNEWS)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

హెర్బల్ టీ అతిగా తీసుకుంటే..

చాలా రకాల దుష్ప్రభావాలు వస్తాయి

గర్భధారణకు హాని కలుగొచ్చు

Mobile Title: 
Herbal Tea: ఈ టీలను అతిగా తాగుతున్నారా.. శరీరానికి ప్రమాదమే..!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 16, 2022 - 15:37
Request Count: 
41
Is Breaking News: 
No