Heart Disease Prediction: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా వేగంగా గుండెపోటు ఇతర సమస్యలు వస్తున్నాయి. అధికంగా అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ప్రస్తుతం గుండెకు హాని కలిగించే ఆహారాలు అతిగా తింటున్నారు. వీటిని తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయో, ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గుండె సమస్యలు తెచ్చిపెట్టే ఆహారాలు ఇవే:
ఉప్పు, పంచదార:
ఉప్పు, పంచదారను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు కలిగిన ఆహారాలు అతిగా తినడం వల్ల అనేక గుండె జబ్బులకు కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి అతిగా ఉప్పు, పంచదార కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రెడ్ మీట్:
అతిగా రెడ్ మీట్ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తర్వగా గుండెపోటు సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అతిగా కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగే రెడ్ మీట్ తీసుకోకపోవడం చాలా మంచిది.
Also Read: Sugar Level: మధుమేహాన్ని, రక్త పోటును తగ్గించే అద్భుతమైన ఆకులు ఇవే, వీటితో ఈ వ్యాధులన్నీ చెక్!
సోడా:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది కలర్ సోడాను తాగడానికి ఇష్టపడుతున్నారు. దీని కారణంగా తీవ్ర కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా తీవ్ర గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రతి రోజూ సోడా తాగడం మానుకోవాల్సి ఉంటుంది.
ఫ్రై చికెన్:
చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది డీప్ ఫ్రైయింగ్ చేసిన చికెన్ తింటున్నారు. ఇందులో ఉండే కేలరీలు, సోడియం గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి అతిగా డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook