Tips To Improve Your Memory: ఒకప్పుడు మనం నెలల తరబడి ఫోన్ నెంబర్లు, చేతి వేళ్ళతో లెక్కలు, ప్రతి సినిమా పేరుతో పాటు రచిత, పాట రాసిన వారు పాడిన వారు ఇలా వరసగా ఎన్నో గుర్తుంచుకోగలిగేవాళ్ళం. కానీ టెక్నాలజీ పెరుగుదలతో పాటు మన బద్ధకం కూడా పెరిగింది. ప్రతిదానికి ఫోన్‌పైన ఆధార పడాల్సి ఉంటుంది. చిన్న చిన్న లెక్కలు కూడా ఫోన్ సహాయంతో చేయాల్సి ఉంటుంది. ఏమీ గుర్తుంచుకోలేకపోతున్నాము. అయితే పాత రోజుల్లో మనం ఎంత షార్ప్ గా ఉండేవాళ్ళమో గుర్తుంచుకుంటే అలాంటి బ్రెయిన్ మనం ఈ చిన్న చిన్న అలవాట్లతో మళ్ళీ అలా మారడం సాధ్యమేనని వైద్యులు చెబుతున్నారు. దీని కోసం మీరు కొన్ని అల్లవాట్లను మార్చుకోవాలి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ ఎంతో చురుకుగా ఉంటుంది. అయితే ఎలాంటి పనులు చేయడం వల్ల మన బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది అనేది తెలుసుకుందాం.
బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే?
బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. శరీరక వ్యాయామం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి, మెదడుకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇది మెదడు నరాలను చురుగ్గా ఉంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వీటితో పాటు మనం తీసుకొనే ఆహారం శరీరానికి ఎంతో అవసరం. మీరు తీసుకొనే ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. నాన్ వెజ్ తో పాటు ఆకుకూరలు, గుడ్లు, పాలు, పెరుగు, తృణధాన్యాలు వంటివి కూడా తినండి.
మనం నిద్రపోయేటప్పుడు మెదడు మన జ్ఞాపకాలను, నేర్చుకున్న విషయాలను నిల్వ చేసుకుంటుంది. మెదడుకు మంచి బూస్ట్ ఇవ్వడానికి ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర తప్పకుండా పోండి. నిద్రపోయే ముందు ఫోన్ చూడకుండా ఉండటం మంచిది. రోజు కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మెదడులోని గ్రేమాటర్ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఏదైనా చదవడం, పజిల్స్ పరిష్కరించడం, కొత్త భాషలు, నైపుణ్యాలు నేర్చుకోవడం వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మంచి చేతి రాతను అలవాటు చేసుకోవడం వల్ల మెదడు పనితీరు, మోటార్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది భాష, ఆలోచనా శక్తిని కూడా పెంచుతుంది. ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించడం వల్ల మీ మెదడు పనితీరు మెరుగుపడి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి