Jeera Water: ఆరోగ్యం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం పరగడుపున కొన్ని పదార్ధాలు తీసుకుంటుంటారు. అందులో ముఖ్యమైంది జీలకర్ర నీరు. ఉదయం పరగడుపున జీరా వాటర్ తాగితే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి..
మీరు ఆరోగ్యంగా , ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలనుకుంటే..మీ డైట్‌లో, దినసరి చర్యలో మార్పులు చేసుకోవాలి. ఉదయం పరగడుపున ప్రతిరోజూ క్రమం తప్పకుండా జీలకర్ర నీరు లేదా జీరా వాటర్ సేవించాలి. జీలకర్రలో ఉండే అద్భుతమైన పోషక గుణాలు ఆరోగ్యానికి ప్రయోజనకరం. వివిధ రకాల అనారోగ్య సమస్యల్నించి కూడా జీరా వాటర్ రక్షిస్తుంది. ఖాళీ కడుపుతో జీరా వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
1. కడుపు నొప్పి సమస్య లేదా ఎసిడిటీ ఉన్నవారు తప్పకుండా ఉదయం పరగడుపున జీలకర్ర నీరు తాగాలి. దీనివల్ల కడుపు నొప్పి, ఎసిడిటీ సమస్య దూరం కావడమే కాకుండా..వాపు, అజీర్ణ సమస్యల్నించి కూడా ఉపశమనం కల్గిస్తుంది. జీరా వాటర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
2. ప్రస్తుతం స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు కొత్త కొత్త పద్ధతులు ఆశ్రయిస్తున్నారు. రోజూ పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. జీలకర్ర నీళ్లు శరీరం మెటబోలిజంను మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ కూడా బర్న్ చేస్తుంది. శరీరంలో పేరుకుపోయే వ్యర్ధ కొవ్వును దూరం చేస్తుంది.
3. వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధుల్నించి రక్షణ పొందేందుకు ఇమ్యూనిటీ బలపడటం చాలా అవసరం. జీలకర్రలో ఉండే ఫైబర్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యల్నించి దూరం కావచ్చు.
4. జీలకర్ర నీటిలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా జీరా వాటర్ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మీరు కూడా బీపీ పేషెంట్ అయితే..వెంటనై మీ డైట్‌లో జీరా వాటర్ చేర్చి చూడండి. నెలరోజుల్లోనే ఫలితం గమనించవచ్చు.
Also read: Monsoon Makeup Tips: వర్షాకాలంలో మేకప్ ఎక్కువసేపు నిలవాలంటే ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook