Fenugreeks Benefits: మెంతులతో మైండ్ బ్లాక్ అయ్యే బెనిఫిట్స్, మధుమేహానికి కూడా చెక్‌ పెడుతుంది..!

Fenugreeks Benefits: మెంతులు లేదా మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మెంతులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 09:49 AM IST
Fenugreeks Benefits: మెంతులతో మైండ్ బ్లాక్ అయ్యే బెనిఫిట్స్, మధుమేహానికి కూడా చెక్‌ పెడుతుంది..!

Fenugreeks Benefits: ఆరోగ్యాన్ని కాపాడుకునే చిట్కాలన్నీ మన వంటింట్లోనే ఉంటాయండి. అయితే అవి ఎలా వాడాలో తెలియాలి అంతే. మన కిచెన్ లో ఎప్పుడూ ఉండేవి మెంతులు. దీనిని తక్కువ అంచనా వేయకండి.  ఇది ఎన్నో ఔషధ విలువలు కూడా కలిగి ఉంటుంది. ఆహారంలో భాగంగా మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి. మెంతుల్లో కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, జింక్, ఫైబర్, ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెంతుల్లో వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

మెంతుల వల్ల కలిగే బెనిఫిట్స్
** మెంతులు మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతోపాటు మలబద్దకాన్ని కూడా దూరం చేస్తుంది. 
** చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. 
** షుగర్ ను నియంత్రించడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి.  
** హెయిల్ ఫాల్ సమస్యకు మెంతులు చెక్ పెడతాయి. 
** మెంతి కూర తినడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. 
** రక్తహీనత సమస్య ఉన్నవారు మెంతులు తినడం చాలా మంచిది. 
** మహిళల్లో పాల ఉత్పత్తి పెరగడానికి మెంతులు సహాయపడతాయి. 

Also Read: Camphor Benefits: రూ.2 కర్పూరంతో ఇన్ని జబ్బులు నయమవుతాయా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News