Side Effects Of High Protein Diet: మన శరీర నిర్మాణానికి ప్రోటీన్లు చాలా అవసరం. వీటిని తీసుకోవడం మన బాడీకి చాలా మెుత్తంలో పోషకాలు అందుతాయి. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాం, ఎటువంటి వ్యాధులు దరిచేరవు. మనం తీసుకునే ప్రొటీన్ పరిమాణం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. పురుషులకు రోజుకు 56 గ్రాముల ప్రొటీన్ అవసరం కాగా, స్త్రీలు రోజుకు 46 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి. ఎముకలు, కండరాలు, చర్మం మరియు వెంట్రుకల అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ శరీర కణజాలాన్ని నిర్మించడంతోపాటు ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుంది. అయితే ప్రోటీన్లు అధిక తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధులు వచ్చే అవకాశం
1. జీర్ణక్రియ సమస్య- అధిక ప్రొటీన్లు తీసుకునే వారికి జీర్ణక్రియ సమస్య రావచ్చు. ఎందుకంటే ప్రొటీన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీనితో పాటు ఇది మీ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది.
2. డయేరియా సమస్య- అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది, అప్పుడు మీరు డయేరియా బారిన పడవచ్చు. దీనితో పాటు శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.
3. బరువు పెరగడం- మీరు బరువు తగ్గడానికి ప్రోటీన్ ఆహారం తీసుకుంటారు. అయితే మీరు డైట్ చేయకుండా ప్రోటీన్ పుడ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరు వ్యాయామం చేయకపోతే తగ్గడానికి బదులు పెరుగుతారు.
4. అలసటగా అనిపించడం- మీరు ప్రోటీన్ పుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసటకు గురయ్యే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
ఎక్కువ ప్రోటీన్ పుడ్ తింటున్నారా? అయితే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్లే..!