Watermelon benefits: ఎండా కాలం వచ్చేసింది. వేసవిలో మన శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువగా పుచ్చకాయ తినమని నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పుచ్చకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. పుచ్చకాయలో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో రకాల వ్యాధుల రాకుండా అడ్డుకుంటుంది. పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
పుచ్చకాయ ప్రయోజనాలు
** పుచ్చకాయ తినడం వల్ల శరీరీం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది.
** వాటర్ మిలాన్ ను తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
** పుచ్చకాయలో వాటర్ కంటెంట్ తోపాటు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది, తర్వాత ఆకలి వేయదు.
** ఇది జీర్ణక్రియను మెరుగు పరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
** మూత్రపిండాలను ఆరోగ్యం ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
** కండరాల నొప్పిని తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.
** చర్మానికి నిగారింపు ఇవ్వడంలో పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read; Motion sickness: ప్రయాణంలో వాంతులు వస్తున్నాయా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook