Health Benefits Of Muskmelon: ఖర్బూజతో నమ్మశక్యం కానీ ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Muskmelon benefits: మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజూ 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ హీట్ వేవ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే తరుచూ నీళ్లు, పళ్లు, డ్రింక్స్ తీసుకుంటూ ఉండాలి. వేసవిలో ఖర్భూజ పండు తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 20, 2023, 05:07 PM IST
Health Benefits Of Muskmelon: ఖర్బూజతో నమ్మశక్యం కానీ ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Health Benefits of Muskmelon: ఎండలు ఓ రేంజ్‌లో మండి పోతున్నాయి. సమ్మర్ లో మీరు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ శరీరం డీహైడ్రేట్ కు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ వేసవిలో హీట్ వేవ్ బారి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని డ్రింక్స్ లేదా పళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో ఖర్భూజ ఒకటి.  ఇది వేసవిలో చాలా విరివిగా దొరికే ప్రూట్. ఇది తినడం లేదా దీని జ్యూస్ తాగడం వల్ల మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. ఖర్బూజతో కలిగే ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. 

ఖర్బూజ ప్రయోజనాలు
** ఈ పండులో పైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 
** ఖర్బూజలో విటమిన్‌ కె, ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
** ఈ ఫ్రూట్ లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇది మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది.
** ఖర్బూజలో ఉండే బీటా కెరోటిన్ మీరు క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. 
** మీరు ఖర్భూజ జ్యూస్ తాగడం వల్ల వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
** కంటిచూపును మెరుగుపరచడంలో ఖర్భూజ సూపర్ గా పనిచేస్తుంది. ఇది బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. 
** కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఖర్భూజను తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ఇది గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది. 

Also Read: Weight Loss Drinks: రోజూ పరగడుపున ఈ డ్రింక్స్ తీసుకుంటే, 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News