Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

Sunscreen Lotion: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల్లో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్ రాస్తుంటారు. కానీ అది ఎలా రాయాలో అందరికీ తెలియదు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2024, 08:32 PM IST
Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

Sunscreen Lotion: ఎండాకాలం చర్మ సంరక్షణ చాలా చాలా ముఖ్యం. లేకపోతే చర్మం నల్లబడిపోతుంటుంది. తీక్షణమైన సూర్య కిరణాల్నించి ముఖాన్ని, చర్మాన్ని కాపాడుకోవల్సి ఉంటుంది. లేకపోతే చర్మం నల్లబడటం, ముడతలు ఏర్పడటమ కాకుండా స్కిన్ కేన్సర్ సమస్య కూడా లేకపోలేదు. 

ఎండాకాలంలో స్కిన్ కేర్ అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది సన్‌స్క్రీన్ లోషన్ రాయడం ద్వారా హాని కల్గించే యూవీ కిరణాల్నించి రక్షణ పొందుతుంటారు. అయితే సన్ స్క్రీన్ ఎలా రాయాలనేది తెలుసుకోవడం చాలా అవసరం. సన్‌స్క్రీన్ రాసే కొన్ని సరైన పద్ధతులున్నాయి. ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం. సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా సోకే ప్రమాదం లేకపోలేదు. కిటికీల ద్వారా ఇవి చర్మానికి తాకి హాని కల్గించవచ్చు. అందుకే కేవలం బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. కొన్ని సన్‌స్క్రీన్ లోషన్స్ మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ వాడకంలో ఎదురయ్యే బ్లూ స్క్రీన్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

సన్‌స్క్రీన్ అనేది ఎక్కువ సేపు రక్షణ కల్పించదు. ఒకసారి రాసిన తరువాత 3-4 గంటల వరకే ఆ ప్రభావం ఉండవచ్చు. అందుకే ప్రతి 3-4 గంటలకోసారి సన్‌స్క్రీన్ లోషన్ రాయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఎండలో ఉన్నప్పుడు చెమట్లు పడుతుంటే మళ్లీ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సన్‌స్క్రీన్ లోషన్ రాసేటప్పుడు కేవలం ముఖానికే కాకుండా చెవులు, మెడ, భుజాలు, చేతులు, కాళ్లకు సంబంధించి ఏ భాగాలైతే బయటకు కన్పిస్తుంటాయో వాటన్నింటికీ రాయాలి. 

ముఖం, మెడకు వీలైనంత ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి. తక్కువ రాస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. సన్‌స్క్రీన్ ప్రభావం కన్పించేందుకు కనీసం 15-20 నిమిషాల సమయం పడుతుంటుంది. అందుకే బయటకు వెళ్లడానికి 15-20 నిమిషాల ముందే సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. సూర్యుని యూవీ కిరణాల నుంచి పూర్తిగా రక్షణ కలగాలంటే పైన చెప్పిన విధంగానే సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. అప్పుడే పూర్తి ప్రయోజనం కలుగుతుంది. 

Also read: Vitamin Deficiency: మీ శరీరంలో ఈ మూడు విటమిన్ల లోపం లేకుండా చూసుకుంటే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News