Hair Care Routine: జుట్టు అందంగా, మెరుస్తూ కనబడాలంటే మనం జుట్టుపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యల బారిన పడుతున్నవారి సంఖ్య పెరగడం విశేషం. అయితే ప్రస్తుతం చాలా మందిలో వివిధ రకాల ప్రోడక్ట్ వినియోగించడం వల్ల ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తల స్నానం చేసిన ప్రతి సారి జుట్టును కాటన్ టవల్‌తో ఎక్కువసేపు చుడుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టుకు వివిధ రకాల సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని కోసం పలు రకాల సూచనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వీటి వల్లే ఈ జుట్టు సమస్యలు:
>>జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. మీరు సరైన పోషకాహారం తీసుకోలేదని అర్థం. అంతేకాకుండా జుట్టును కడిగిన తర్వాత ఎక్కువసేపు చుట్టి ఉంచడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు తెలుపున్నారు.
>>ఎక్కువ సేపు చుట్టడం వల్ల జుట్టు కూడా రెండు భాగాలుగా మారుతుంది. ఇదే క్రమంలో జుట్టు యొక్క షైన్ కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
>>జుట్టు కడిగిన తర్వాత టవల్‌తో జుట్టు మూలాలలో చాలా వేగంగా రుద్దుతారు. దీని కారణంగా తల యొక్క సహజ నూనె తగ్గిపోతుంది. దీంతో జుట్టు పొడిబారుతుంది.
>>ప్రస్తుతం చాలా మంది జుట్టును టవల్‌తో తుడిచిన తర్వాత ముఖాన్ని కూడా రుద్దుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బ తినే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook