Green Chilli Side Effects: ప్రస్తుతం చాలా మంది మసాలాను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ క్రమంలో మిరపకాయలను కూడా ఎక్కువగా తింటున్నారు. మీరు కూడా ఇలానే తింటున్నారా..ఇక అంతే సంగతని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గ్రీన్ చిల్లీలను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని ప్రతి రోజూ తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే వీటిని అతిగా వినియోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.స
మిరపకాయలు ఎక్కువ తింటే ఈ సమస్యలు తప్పవు!
1. పైల్స్ సమస్య:
మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల పైల్స్ సమస్య వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని అతిగా తినడం వల్ల పొట్టలో వేడి తీవ్రత పెరిగి పైల్స్‌కు కారణమవుతుంది. అంతేకాకుండా పురీషనాళంలో బర్నింగ్ సెన్సేషన్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి అతిగా వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
2. కడుపులో అల్సర్ సమస్య:
మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో పుండు సమస్యలు వస్తున్నాయి. నిజానికి మిరపకాయలను పరిమితికి మించి తినడం వల్ల మీ పొట్టలోని పొరను పాడుచేసి, ఎసిడిటీకి కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
3. ముఖంపై వాపు, మంట సమస్య:
ఎర్రటి మిరపకాయలను అతిగా తినడం వల్ల ముఖంలో వాపు, మంట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖంలో దురదతో పాటు చికాకు వంటి సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి తప్పకుండా ఎర్రటి మిరపకాయలను అతిగా తీసుకోవడం మానుకోవాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్
Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్.. యాంకర్ జబర్దస్త్ రిప్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook