Gray Hair Problems: వెంట్రుకలు తెల్లబడటం సమస్య ఈ కాలంలో అందరిని వేధిస్తుంది చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి కొన్ని రకాల టిప్స్ పాటిస్తే వెంట్రుకలు తెల్లబడకుండా మనం నివారించవచ్చు.
ఆరోగ్యకరమైన డైట్..
వెంట్రుకలు త్వరగా తెలపడకుండా ఉండాలంటే మన ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ని తీసుకుంటూ ఉండాలి. ఖనిజాలు మన వెంట్రుకలను బలంగా ఆరోగ్యకరంగా ఉండేలా సహాయపడతాయి వెంట్రుకలు తెల్లబడకుండా కాపాడతాయి.
స్మోకింగ్..
స్మోకింగ్ తీసుకోవడం కూడా వెంట్రుకలు త్వరగా తెల్లబడటానికి ప్రధాన కారణం. స్మోకింగ్ ని ఆపేస్తే వెంట్రుకలు తెల్లబడకుండా ఉండటమే కాకుండా ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది.
స్ట్రెస్..
విపరీతమైన స్ట్రెస్ కూడా వెంట్రుకలు తెల్లబడటానికి ప్రధాన కారణం. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడి పోతుంటాయి. స్ట్రెస్ లెవల్స్ పెరగడానికి కారణమైన పనులను తగ్గించుకోవాలి. ఎక్సర్‌సైజ్ ,మెడిటేషన్ యోగ ప్రతిరోజు చేస్తూ ఉండాలి. దీంతో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. వెంట్రుకలు త్వరగా తెల్లబడవు.
సూర్యుడి నుంచి రక్షణ..
విపరీతమైన ఎండ నుంచి మన వెంట్రుకలను కాపాడుకోవాలి. సూర్యుని హానికర అల్ట్రా వైలెట్ రేస్ మన జుట్టు ను త్వరగా వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి. అందుకే హెయిర్ కేర్ వస్తువుల్లో ఎస్పీఎఫ్ ఉండే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉండాలి.
హెయిర్ ట్రీట్మెంట్స్..
హానికర హెయిర్ ట్రీట్మెంట్లకు దూరంగా ఉండాలి. అంటే హెయిర్ డ్రై చేసుకోవడం కెమికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం హీటింగ్ టూల్స్ వాడటం తగ్గించుకోవాలి. దీంతో కూడా హెయిర్ త్వరగా తెల్లబడిపోతాయి తరచూ వీటిని వాడకుండా ఉండాలి. బదులుగా సహజసిద్ధమైన పద్ధతులను ఫాలో అవుతే వెంట్రుకలు ఆరోగ్యంగా నల్లగా ఉంటాయి.
ఇదీ చదవండి: కొలెస్ట్రాల్ కట్ చేసే వెల్లుల్లి పసుపు పచ్చడి.. ఇలా తయారు చేసుకోండి..
సున్నితమైన వస్తువులు..
మన జుట్టుకు సున్నితమైన షాంపూలు కండిషనర్లు మాత్రమే ఉపయోగించాలి. విపరీతమైన కెమికల్స్ ఉండే వాటికి దూరంగా ఉండాలి దీంతో జుట్టు డామేజ్ అవుతుంది త్వరగా తెలపడిపోతుంది.
హెయిర్ కేర్ రొటీన్..
జుట్టును తరచూ వాష్ చేసుకున్నప్పుడల్లా కండిషనర్ కూడా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా జుట్టును దువ్వుకోవాలి హెయిర్ స్ప్లిట్స్ రాకుండా జాగ్రత్త పడాలి. జుట్టును గట్టిగా లాగడం తగ్గించుకోవాలి.
హెయిర్ కలర్..
ఏదైనా వస్తువులను వాడేటప్పుడు నాచురల్ హెయిర్ కలర్స్ ని వాడాలి. కెమికల్స్ అధికంగా ఉండే హెయిర్ కేర్స్ ను వాడటం వల్ల అవి మరింత తెల్లబడి పోతుంటాయి పరిస్థితి మరి దారుణంగా మారిపోతుంది వైద్యులను సంప్రదించి మంచి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగించాలి.
ఇదీ చదవండి: బరువు తగ్గాలని చాలా కఠిన ప్రయత్నాలు చేస్తున్నారా? మజ్జిగలో ఈ ఒక్కవస్తువు కలిపి తాగి చూడండి..
సప్లిమెంట్స్..
ఆరోగ్య నిపుణులను సంప్రదించి మన డైట్ లో బయోటిన్, విటమిన్ బి12, విటమిన్ ఇ ఇతర ఆరోగ్యకరమైన సప్లిమెంట్స్ ను డైట్ లో చేర్చుకోవాలి ఇది తెలుచుట్టు తెల్లబడకుండా కాపాడుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Gray Hair Problems: వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి..