Snakes in rainy season: సాధారణంగా ఎక్కడైనా ఒక పాము కనిపించిందంటే చాలు గుండె హడాలెత్తిపోతుంది. అలాంటిది వర్షాకాలంలో ఇక ఆ పాముల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎక్కడైనా చెత్తగా అనిపించిందంటే చాలు.. చిన్న పాము అయినా కనిపిస్తూ అందరిని భయపెడుతూ ఉంటాయి.
మరి ఇలాంటి పాముల బెడద ఎక్కువగా వర్షాకాలంలోనే ఉంటుంది.. మరి వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ పాముల బెడద ఉండదు అని చెబుతున్నారు నిపుణులు. ఇంటి చుట్టూ కొన్ని మొక్కలు నాటితే పాములు ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించవు అని చెబుతున్నారు. మరి ఆ మొక్కలు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
పాము మొక్క:
ఈ మధ్యకాలంలో ఈ మొక్క బాగా ప్రావీణ్యం పొందింది. ఈ మొక్కను మీరు ఇంట్లో కుండీలో పెట్టి కిటికీలో లేదా వరండాలో ఉంచితే.. దీని వాసన వల్ల పాములు, తేళ్లు మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు. మీ కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుంది.
నిమ్మ గడ్డి మొక్క:
సాధారణంగా నిమ్మగడ్డి.. ఇంటి ఆవరణలో లేదా కాంపౌండ్ లోపల కుండీలలో పెంచినట్లయితే.. దోమలు నివారించవచ్చు అని చెబుతారు. కానీ దీని నుంచి వెలువడే వాసన పాములను కూడా హడలెత్తిస్తుందట. మీరు మీ ఇంటి చుట్టుపక్కల లేదా ఇంటి లోపల ఈ మొక్కలను పెంచినట్లయితే దీని వాసనకు పాములు రావు.
వేప నూనె:
వర్షాకాలంలో ప్రత్యేకించి ఇంటి బయట.. నేలపైన వేప నూనెను పిచికారీ చేస్తే.. దీని వాసనకు దోమలతో.. పాటు పాములు కూడా దూరం అవుతాయి.
తులసి మొక్క:
హిందూ శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ..ఈ తులసి మొక్కను దైవంగా భావించడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ తులసి మొక్క పాములను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. మీరు మొక్కలను కుండీలో పెట్టి ఇంటి తలుపు కిటికీ లేదా బాల్కనీలో.. పెడితే పాములు చేరవు అని పెద్దల నమ్మకం.
కాక్టస్ మొక్క..
ఒక కుండీలో ఈ మొక్కను పెంచి.. ఇంటి బయట లేదా వరండాలో ఉంచితే దీని చుట్టూ పాములు చేరవు.. దీని వాసనకు పాములు రావట..
ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షాకాలంలో పాముల బెడద నుండి తప్పించుకోవచ్చు.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Snakes: వర్షాకాలంలో పాముల బెడదా..ఇలా చేస్తే పరార్!