Foods For Glowing Skin: మెరిసే చర్మం పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడా వివిధ రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల కొంత మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ముఖం అందహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండానికి ముఖం మెరిసేలా ఉండడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆరోగ్యకరమైన కూరగాయలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలను తీసుకుంటే చర్మం మెరిసేల తయారవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖం అందంగా తయారు కావడానికి తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది:
1. బీట్‌రూట్ చర్మానికి మేలు చేస్తుంది:
బీట్‌రూట్ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని నిర్విషీకరణం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.
2. బొప్పాయి పండు:
ప్రస్తుతం చాలా మంది బొప్పాయి పండు మాస్క్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా చర్మ సమస్యలు సులభంగా దూరమవుతాయని సౌదర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ పండును ప్రతి రోజూ తినడం వల్ల కూడా సలుభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి ముఖాన్ని మృదువుగా, కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది.
3. గుడ్డు చర్మానికి మేలు చేస్తుంది:
గుడ్డు శరీరాన్ని బలంగా చేయడమేకాకుండా చర్మానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గుడ్డులో ఉండే పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి7, ప్రొటీన్లు, ఐరన్, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి చర్మం మెరిసేలా తయారవుతుంది.
4. అరటిపండు:
మెరిసే చర్మం పొందడానికి అరటిపండు కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని సులభంగా దృఢంగా చేస్తాయి. ఇందులో విటమిన్ ఎ, బి, ఇ లభిస్తాయి. కాబట్టి చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook