Face Yoga Tips: మీ ముఖ చర్మం వదులైపోయిందా..ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు కన్పిసున్నాయా..ఈ సమస్యల్నించి గట్టేక్కేందుకు అద్భుతమైన ఫేస్ యోగా టిప్స్ గురించి తెలుసుకుందాం..
మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అనేది ఆ వ్యక్తి చర్మకాంతిని బట్టి చెప్పేయవచ్చు. చర్మం మెరుస్తుంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్ధం. అయితే ఆధునిక జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, కావల్సినంత నిద్ర లేకపోవడంతో ముఖంపై ముడతలు, నిర్జీవంగా ఉండటం, చర్మం వదులైపోవడం కన్పిస్తుంది. తక్కువ వయస్సైనా ఇలాంటి లక్షణాలు కన్పిస్తుంటాయి. మరి ఫిట్‌గా ఉండేందుకు యోగా నిత్యం చేయాలి. కొన్ని రకాల ఫేస్ యోగా టిప్స్‌తో వదులుగా ఉన్న ముఖ చర్మాన్ని తిరిగి ఫిట్ చేసుకోవచ్చు.
హాలాసనం
వీపు ఆధారంగా హాలాసనం వేయడం అలవాటు చేసుకోవాలి. చేతుల్ని చంకల్లో ముడవాలి. కాళ్లను 90 డిగ్రీలు పైకి లేపేందుకు కడుపు కండరాల్ని ఉపయోగించాలి. ఇప్పుడు చేతుల్ని గట్టిగా నొక్కి..కాళ్లను తల వెనుకగా వదలలి. అవసరమైతే వీపు దిగువ భాగాన్ని చేతులతో సపోర్ట్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల ముఖం, భుజాలపై వదులైన చర్మం తిరిగి టైట్ ఫిట్ అవుతుంది. అయితే మెడనొప్పి, భుజాల నొప్పి ఉన్నవాళ్లు ఈ ఆసనం వేయకూడదు. పీరియడ్స్, గర్భిణీ మహిళలు కూడా ఈ ఆసనం వేయకూడదు.
సూపర్ పవర్ మెడిటేషన్‌తో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ ఆసనం వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆసనం వేయాలంటే..ముందుగా ఒకచోట కూర్చోవాలి. ధ్యాన ప్రక్రియ ద్వారా లోతుగా శ్వాస పీల్చడం, వదలడం చేయాలి. ఇలా 15 నిమిషాల సేపు చేయాలి. దీనివల్ల స్ట్రెస్ దూరమవుతుంది. ఇన్నర్‌గా చాలా ఫ్రీగా ఉంటుంది. ఈ ఆసనాన్ని ఎవరైనా వేయవచ్చు. దీనివల్ల చర్మం ఫిట్‌గా ఉండటమే కాకుండా చాలా రోగోల్నించి ఉపశమనం లభిస్తుంది.
Also read: National Doctors Day 2022: కరోనా వారియర్లకు బిగ్ శెల్యూట్, జూలై 1 హ్యాపీ డాక్టర్స్ డే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.