Excessive Protein Diet: ప్రోటీన్లు గల ఆహార పదార్థాలను అతిగా తింటే ప్రమాదమే..!

Protein Poisoning: ప్రస్తుత అందరూ ఆకర్షణీయంగా కనిపించేందుకు శరీర ఆకృతిని పెంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తనను తాను చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2022, 04:50 PM IST
  • ప్రోటీన్లు గల ఆహార పదార్థాలను అతిగా తింటే..
  • బరువు పెరుగుటం, డీహైడ్రేషన్ సమస్య
  • డిప్రెషన్ సమస్య రావొచ్చు.
Excessive Protein Diet: ప్రోటీన్లు గల ఆహార పదార్థాలను అతిగా తింటే ప్రమాదమే..!

Protein Poisoning: ప్రస్తుత అందరూ ఆకర్షణీయంగా కనిపించేందుకు శరీర ఆకృతిని పెంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తనను తాను చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలో బరువు తగ్గడం చాలా అవసరం.. కావున వ్యాయామం చేయడం.. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో పోషకాలున్న ఆహారం తీసుకోవడం చాలా మేలు..కావున అధికంగా పోషకాలున్న ఆహార పదార్ధాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.  ప్రోటీన్స్‌ అధిక పరిమాణంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల  చర్మం, జుట్టు మెరుగుపడుతుంది. అయితే ప్రోటీన్స్‌ అతిగా తీసుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కావున తీసుకునే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆహారంలో ఎంత మొత్తంలో ప్రోటీన్ ఉండాలి?:

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన  శరీరంలోని ప్రతి కిలోగ్రాములో 1 గ్రాము ప్రోటీన్ ఉండాలి. ఇదే కాకుండా.. శరీరంలో పిండి పదార్థాలు, కొవ్వు పరిమాణం కూడా సరిగ్గా ఉండాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ప్రొటీన్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల కలిగే నష్టాలు ఇవే:

1. బరువు పెరుగుటం:

ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం సమస్యల బారిన పడుతున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

2. డీహైడ్రేషన్ సమస్య:
రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌ అధికంగా ఉంటే.. డీహైడ్రేషన్‌ సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కావున ప్రోటీన్ల గల ఆహారాన్ని మోతాదులో ఉండేట్లు చూసుకోండి.

3. డిప్రెషన్ సమస్య రావొచ్చు:
ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే పలు సందర్భాల్లో డిప్రెషన్‌ కూడా దారీ తీయోచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రోటీన్లు కొన్ని సందర్భాల్లో శరీరంలో ఒత్తిడి హార్మోన్లను పెంచి డిప్రెషన్‌కు గురి చేయోచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!

Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News