Is Walnut Good In Summer: చలికాలంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అతిగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది వేసవిలో వీటితో తయారు చేసిన డ్రింక్స్‌ను విచ్చలవిడిగా తాగుతున్నారు. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్‌ను కూడా తీసుకుంటున్నారు. ఇలా వేసవిలో వీటిని తినడం మంచిదేనా.? ఎండకాలంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
వేసవి కాలంలో వాల్‌నట్స్ తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా వేడి కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇవి గుండెల్లో మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి వాల్‌నట్స్‌ను ఎండా కాలంలో ఎలా తీసుకోవడం మంచిదో తెలుసుకుందాం
1. పాలతో వాల్ నట్స్‌ను తీసుకోవచ్చా?:
వాల్ నట్స్‌ను పాలలో వేసి బాగా మరిగించి పడుకునే ముందు తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీర వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా సహాయపడుతుంది.
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
2. షేక్స్ లేదా స్మూతీస్‌లను తాగొచ్చు:
వాల్ నట్స్‌ను షేక్స్ లేదా స్మూతీస్‌ల చేసుకోని తాగడం వల్ల కూడా శరీరానికి లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వాల్‌నట్స్‌లో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
3. వాల్ నట్స్ సలాడ్:
వేసవి కాలంలో వాల్ నట్స్ శరీరాన్ని తేమ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. అయితే వాల్ నట్స్ సలాడ్స్‌ల తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ సలాడ్స్‌లో పెరుగును వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చు.
4. పాలలో వాల్‌నట్స్ నానబెట్టి తీసుకోండి:
ఒక గ్లాసు పాలలో 2 వాల్‌నట్స్‌ను నానబెట్టి వేసవి కాలంలో ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలా తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.