Dry Amla Powder Benefits: ఉసిరి వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేద నిపుణులు ఈ ఉసిరిని అద్భుత మూలికగా భావిస్తారు. భారత్‌లో ఇవి ఎక్కువగా చలికాలంలో లభిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఎండినవి కూడా వాటిలో అందుబాటులో ఉన్నాయి. పచ్చివి కంటే ఎండిన ఉసిరి అనేక రకాల వ్యాధులకు ఔషధంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను సులభంగా నియంత్రిస్తాయి. తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడేవారు ప్రతిరోజు వీటి చూర్ణాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఉసిరి చూర్ణంలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వానాకాలంలో ఈ చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉసిరి పొడిని క్రమంగా తీసుకునే వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరిగిందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
ఆధునిక జీవనశైలి అనుసరించే చాలామందిలో జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా అధిక శరీర బరువు పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఎండిన ఉసిరి ముక్కలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల తొందర్లోనే ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఆయుర్వేద లక్షణాలు పొట్టలో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తాయి.
ప్రస్తుతం చాలామంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి వ్యాధులతో సతమతమవుతున్న వారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎండిన ఉసిరితో తయారుచేసిన చూర్ణాన్ని ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల వాటి ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యలను కూడా ప్రభావంతంగా తగ్గిస్తాయి.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook