Benefits Of Meditation: మానవులు ప్రతి ఒక్కరూ వారి వారి పనులు వల్ల ఎన్నో ఒత్తిడులు, ప్రశాంతత లేని జీవితంతో విసిగిపోయే వారు చాలా మంది ఉన్నారు. మనస్సులో ఆందోళన తగ్గేందుకు అనేక విధాలుగా శ్రమిస్తుంటారు. అయితే ధ్యానం చేయడం వల్ల మానసిక ఆందోళన, చికాకులకు స్వస్తి పలకవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ఏకాగ్రత, అవగాహన స్పష్టత, సమాచార అభివృద్ధి కోసం ధ్యానం ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల దేహానికి అంతర్గత బలం చేకూరుతుంది. అయితే ఇటీవలీ కాలంలో మన దేశంలోని కొన్ని కీలక నగరాల్లో ధ్యానం గురించి సర్వే చేయడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం పుణె, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో మానసిక ప్రశాంతత కోసం చాలా మంది ప్రజలు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నట్లు తేలింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ నిద్రలేమి, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ధ్యానం వైపు మొగ్గుచూతున్నట్లు నివేదిక తెలిపింది. అయితే ధ్యానం వివిధ వయసుల వారికి భిన్నంగా సహాయపడుతుందనే విషయాలు సర్వేలో వెులుగుచూశాయి.
ఈ సర్వే ద్వారా వెల్లడైన విశేషాలు ప్రకారం.. అన్ని వయస్సుల వారిలో శాంతి, ఆనందం కొరకు ధ్యానం చేస్తున్నామని చెప్పినవారే అగ్రస్థానంలో ఉన్నారు. 18 - 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు 20 శాతం మంది ఉండగా.. 26 - 35 ఏళ్ల మధ్య వయసున్న వారు 42 శాతం మందిగా ఉన్నారు.
మరోవైపు 36 - 45 ఏళ్లు, 46 - 55 ఏళ్ల వయసు వారు 49 శాతం మంది ఉన్నారు. అదే విధంగా సీనియర్ సిటిజన్లలో 41% శాతం మంది శాంతి, ఆనందం కోసమే ధ్యానం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ధ్యానం ప్రతిరోజూ చేయడం వల్ల బుద్ధికుశలతతో పాటు ఏకాగ్రత దక్కుతుందని ఓ సర్వేలో వెలుగు చూసింది. అయితే యువతలో చాలా మంది ఒత్తిడిని జయించేందుకు దాదాపుగా 25 శాతం మందికి తోడ్పడుతుంది. అతి నిద్రను తగ్గించుకోవడం కోసం 21 శాతం మంది.. వ్యక్తిగత ఎదుగుదలపై 20 శాతం మంది ధ్యానం చేస్తున్నామని సర్వే తెలిపింది.
చివరగా సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మంది మానసిక ప్రశాంతతతో పాటు
వ్యక్తిగత ఎదుగుదలకై 16 శాతం మందికి ధ్యానం తోడ్పడుతుంది. నిద్ర లేమి వంటి మరే ఇతర రుగ్మతల నివారణ కోసం 12 శాతం మంది ధ్యానాన్ని ఎంచుకున్నట్లు తేలింది.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో భారతీయులు ఒత్తిడి, మానసిక ఆందోళనలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. అదే విధంగా అధ్యయానాల్లో ధ్యానం చేసే వారి సంఖ్య కూడా భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నట్లు సర్వే వెల్లడించింది. అయితే ధ్యానం చేయడం వల్ల శరీరంలో సానుకూల మార్పు కలుగుతుందని తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి