Diabetic Risk Factors: మధుమేహం రావడానికి ఇవే కారణాలు.. వీటిని దూరంగా ఉంటే మీ దరిదాపుల్లోకి కూడా రాదు..

Those Things 5 Diabetic Risk Factors: చాలా మందిలో ఈ కింద పేర్కొన్న అలవాట్ల వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి మధుమేహం సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 12:42 PM IST
Diabetic Risk Factors: మధుమేహం రావడానికి ఇవే కారణాలు.. వీటిని దూరంగా ఉంటే మీ దరిదాపుల్లోకి కూడా రాదు..

Those Things 5 Diabetic Risk Factors: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే వీటికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యమైన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా గుండె పోటుతో పాటు మధుమేహం సమస్యలు కూడా వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల చెబు అలవాట్లకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జన్యుపరమైన కారణాలు:
జన్యుపరంగా కూడా మధుమేహం వ్యాధి రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంతక ముందు తాతలు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా భవిష్యత్‌ తరం వల్లు కూడా ఇలాంటి సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్య రాకుండా ముందుగానే పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.

నూనె గల ఆహారాలు:
భారతదేశంలోని ప్రజలకు ఆయిల్ ఫుడ్స్ తినే అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే నూనెలు లేకుండా ఆహారాలు తీసుకోవడం చాలా కష్టం. అయితే చెడు నూనెలు అతిగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మధుమేహం బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తరుచుగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

సూక్ష్మపోషక లోపం:
పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్లే శరీరం దృఢంగా తయారవుతుంది. శరీరంలో సూక్ష్మపోషక లోపం ఉంటే తప్పకుండా మధుమేహం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా సూక్ష్మపోషక లోపం ఉండడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది.

వర్కవుట్స్‌ చేయకపోవడం:
ప్రతి రోజూ వర్కవుట్స్‌ చేయడం శరీరానికి చాలా ముఖ్యం లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే చాలా మందిలో వ్యాయామాలు చేయకపోవడం, వర్కవుట్స్‌ చేయకపోవడం వల్ల కూడా మధుమేహం సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Nara Brahmani: జయలలిత ఫామ్‌హౌస్ నారా బ్రాహ్మిణి కొనుగోలు..? సోషల్ మీడియాలో ప్రచారం.. టీడీపీ క్లారిటీ

Also Read: RGV Meets CM YS Jagan : వైఎస్ జగన్‌తో ఆర్జీవీ భేటీ.. పవన్ కళ్యాణ్ పరువుతీసేందుకే కుట్ర?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News