Desi Ghee Benefits: దేశీ నెయ్యి సాంప్రదాయ వంటలలో భారతీయలు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఫిట్‌గా తయారు చేసుకోవడానికి తప్పకుండా దేశీ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిలో ఉండే గుణాలు శరీరానికి ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఆహార పదార్థాల్లో నెయ్యిని కలుపుకుని తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అయితే ఈ ఏయే ఆహార పదార్థాల్లో మిక్స్ చేసుకుని తినొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు, దేశీ నెయ్యి:
ప్రతి రోజు దేశీ నెయ్యిలో ఒక చెంచా పసుపు మిక్స్ చేసుకుని తింటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్స్ శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంపై వాపు, నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
పొడి అల్లం, దేశీ నెయ్యి:
పొడి అల్లం పొడితో పాటు దేశీ నెయ్యిని కలుపుకుని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుతుంది. దీంతో పాటు పేరుకుపోయిన కఫం కూడా సులభంగా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కడుపునొప్పి, వాపు, తలనొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
దేశీ నెయ్యి, సోంపు పొడి:
జీర్ణ క్రియను మెరుగుపరించేందుకు సోంపు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే దేశీ నెయ్యి, సోంపు పొడిని మిక్స్ చేసి తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరంతో పాటు కడుపు నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు.
నల్ల మిరియాల పొడి, దేశీ నెయ్యి:
ప్రతి రోజు నల్ల మిరియాల పొడి, దేశీ నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని ఆరోగ్యకమైన కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా శరీరాన్ని నిర్విషీకరణం చేస్తాయి. దీని కారణంగా పొట్ట సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి