Custard Apple For Weight Loss: శీతాకాలంలో అధికంగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లాభిస్తాయి. అంతేకాకుండా ఈ పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది తినడానికి తియ్యగా ఉంటూ చాలా రుచిని కలిగి ఉంటుంది. సీతాఫలంలో విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. కాబట్టి వీటిని సీతాకాలంలో తీసుకోవడం చాలా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియకు ప్రయోజనకరం:
సీతాఫలంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి కావాల్సిన చాలా రకాల మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్స్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి.
ఉబ్బసం సమస్యలకు చెక్:
సీతాఫలం శరీరానికి చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తింటే శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు కూడా దూరమవుతాయి. ఇందులో ఉండే విటమిన్ బి6 ఆస్తమా అటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును కూడా సులభంగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచతుంది:
సీతాఫలం గుండెను ఆరోగ్యంగా చేయడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. సీతాఫలంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి గుండెకు కూడా మేలు చేస్తాయి.
కంటి చూపును మెరుగుపరుస్తాయి:
కంటిచూపును పెంచేందుకు సీతాఫలం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు కంటి చూపును మెరుగుపరిచి శరీరాన్ని ఆరోగ్యంగా చేసేందుకు కృషి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫలాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణల, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు
Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook