Cucumber Seeds Health Benefits: ఆరోగ్యనిపుణుల ప్రకారం ప్రతిరోజు ఆహారంలో దోసకాయ గింజలను చేర్చుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. దోసకాయలో ఉండే పోషకాలు మాదిరిగానే వీటి గింజల్లో కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఇవి డయాబెటిస్, హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. దోసకాయ గింజలను నేరుగా తినవచ్చు లేదా పొడిగా తయారు చేసుకోవచ్చు. అయితే దోసకాయ గింజలను తినడం వల్ల శరీరంలో కలిగే మరి కొన్ని లాభాల గురించి మనం తెలుసుకుందాం.
సాధారణంగా దోసకాయతో చాలా మంది సలాడ్, రైతా వంటి వాటిలో ఉపయోగిస్తారు. మరి కొందరూ చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. కానీ వీటి గింజలను మాత్రం వృథగా భావిస్తారు. కానీ ఈ గింజలు ఆరోగ్యానికి దివ్యౌషం వంటివి. ఈ గింజలను నేరుగా లేదా పొడి గా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్టను శుభ్రం చేయడం ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయని వైద్యలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గింజలు బరువు నియంత్రించడంలో కూడా కీలక ప్రాత పోషిస్తాయి. ఇంలుఓ ఉండే పోషకాలు కొవ్వును తొలగించి శరీరానికి తేలికగా చేస్తాయి. మీరు బరువు తగ్గాలని అనుకుంటే ఈ గింజలను మీ డైట్‌లో చేర్చుకోవడం ముఖ్యం. దోస గింజలు గుండె ఆరోగ్యానికి మంచి ఎంపిక. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఈ గింజలను తినవచ్చు. రెగ్యులర్‌గా తినడం వల్ల ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి.
చర్మ సమస్యలు ఉన్నవారు కూడా ఈ గింజలను తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పొడి బారకుండా , మొటిమలు రాకుండా చేస్తాయి. చలికాలంలో ఈ గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఒక స్పూన్ దోసకాయ గింజలు తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇతర సమస్యలు రాకుండా చేస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ గింజలను మీ డైట్‌లో భాగంగా చేసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Also Read: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి