Coconut Oil For Face: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది చర్మం సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ రకాల ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ముఖంలో మెరుపు తగ్గిపోయి.. ముడతలు మొదలవుతాయి. అయితే వీటిని నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనె ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వృద్ధాప్యంతో పాటు ఇతర కారణాల వల్ల ముఖంపై ముడతలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి కొబ్బరి నూనెను వినియోగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొబ్బరి నూనె ముఖం నుంచి అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. ఈ నూనె వల్ల ముఖానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనెను ముఖానికి రాసుకుంటే ముఖం మెరుస్తుంది:
కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కావున ఈ నూనెను ముఖానికి రాసుకుంటే కాంతి పెరుగుతుంది. వాస్తవానికి కొబ్బరి నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీనిని ముఖంపై అప్లై చేయడం వల్ల ముఖం మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ముఖానికి రాసుకోవచ్చు.
ముఖంపై ముడతలు పోతాయి:
ముఖంపై ముడతల సమస్యలు ఉంటే.. తప్పకుండా కొబ్బరి నూనెను ముఖానికి రాత్రి పూట రాయాలి. నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టి కొబ్బరి ముడతలు తొలగిచడానికి ప్రభావవంతగా పని చేస్తుంది.
ముఖంపై తేమ:
వాతావరణంలో మార్పుల కారణంగా.. చాలా మందిలో ముఖం పొడిబారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి కొబ్బరి నూనెను ముఖానికి రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ముఖంపై తేమను పెంచేందుకు కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.
ముఖంపై ఉన్న నల్ల మచ్చలు మటు మాయం:
వాతావరణ కాలుష్యం, కలుషిత ఆహారం కారణంగా.. ముఖంపై వివిధ రకాల మచ్చలు వస్తున్నాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అరచేతులకు కొబ్బరినూనెతో ముఖానికి మర్దన చేసి, 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత ఇలాగే ఉంచితే మరకలు పోతాయని వారు పేర్కొన్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook