Coconut Milk For Hair Growth: జుట్టుకు క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతరో అందరికీ తెలిసిందే. అయితే కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా జుట్టుకు వినియోగిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎప్పుడైనా జుట్టుకు పాలను వినియోగించారా..? జుట్టుకు పాలను వినియోగించడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అందులో ఉండే గుణాలు వివిధ జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగి జుట్టుకు విటమిన్లు సి, ఇ, బి1, బి3, బి5, బి6లతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం అందిస్తాయి. కాబట్టి జుట్టుకు కొబ్బరి పాలు చాలా మంచిది. అయితే పాలను ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి పాలు, ఉసిరి:
జుట్టు సంరక్షణ కోసం ఒక గిన్నెలో ఎండబెట్టిన ఉసిరి పొడిని వేసి అందులో కొబ్బరి పాలను పోసి మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాల్సి ఉంటుంది. ఇలా 25 నుంచి 30 నిమిషాలు జుట్టుకు పట్టించిన తర్వాత శుభ్రమైన నీటితో తల స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చాలా రకాల జుట్టు సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జుట్ట షైనింగ్ కూడా పెరుగుతుంది.
మృదువైన జుట్టు కోసం:
కొబ్బరి పాలను జుట్టుకు క్రమం తప్పకుండా పట్టిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టుకు పాలను పట్టించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జుట్టు రంగు కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా జుట్టుకు పాలను అప్లై చేయండి.
చుండ్రు తొలగించడానికి:
అర గిన్నె కొబ్బరి పాలను తీసుకుని అందులో 2 స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేయాలి. ఇలా చేసిన తర్వాత సుమారు 4 నుంచి 5 గంటల వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నుంచి 45 నిమిషాల పాటు ఉంచి. మంచి నీటి శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నుంచి చుండ్రు తొలగిపోతుంది.
మెరిసేలా:
జుట్టు మెరిసేలా, మృదువుగా చేయడానికి కూడా కొబ్బరి పాలు ప్రభావవంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొబ్బరి పాలతో పాటు తేనెను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి శుభ్రం చేస్తే.. తొందరలోనే జుట్టుకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ గుణాలు లభించి జుట్టు మెరిసేలా, మృదువుగా తయారవుతుంది.
Also Read : Prabhas Marriage : రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. రామ్ చరణ్‌పై ప్రభాస్ కామెంట్స్.. పెళ్లి ఎప్పుడంటే?
Also Read : Gruhalakshmi Tulasi : కారు, ఏసీ, టీవీలు లేవు.. ఫోన్ పోయింది.. సంపాదించిందంతా కూడా అటే.. గృహలక్ష్మీ తులసి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Coconut Milk: ఈ పాలతో ఎలాంటి ఖర్చు లేకుండా చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పండి..