Cholesterol Lowering Breakfast: ప్రతి రోజూ ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. లేక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఉదయం పూట ఎంత మంచి ఆహారాలు తీసుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రోజూ తీసుకునే అల్పాహారం కొలెస్ట్రాల్ స్థాయిలపై కూడా చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి మంచి ఆహారాలను తీసుకోవడ్ శరీరానికి చాలా అవసరం. జీర్ణవ్యవస్థలో LDL కొలెస్ట్రాల్ కూడా ఒక భాగం కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏయే పదార్థాలు తినాలో తెలుసుకుందాం.
వీటిని తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
1. వోట్ మీల్:
అల్పాహారం కోసం వోట్ మీల్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థలో LDL కొలెస్ట్రాల్ కూడా ఒక భాగమే కాబట్టి ఉదయం పూట వోట్ మీల్స్ తీసుకుంటే శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోనే వివిధ రకాల పండ్ల ముక్కలను మిక్స్ చేసి తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్యలు కూడా దూరమవుతాయి.
2. ఆరెంజ్ జ్యూస్:
చాలా మంది ఉదయం పూట జ్యూస్‌లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. ఇందులో ఉండే ఫైబర్ శరీరాన్ని యాక్టివ్‌గా చేయడమేకాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రిస్తాయి.
3. సాల్మన్ ఫిష్:
సాల్మన్ ఫిష్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా శరీరానికి కీడు చేసే రక్తంలో ఉన్న ట్రైగ్లిజరైడ్ల సంఖ్యను తగ్గిస్తాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి ఈ చేప మాంసం ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
4. గుడ్డులోని తెల్లసొన:
తెల్లసొనలో పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీనిని అల్పాహారంలో భాగంగా తీసుకుంటే బాడీ ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook